గుంటూరు జిల్లాలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. పాజిటివ్ కేసుల తీవ్రత అధికంగా ఉన్న 12 రెడ్‌జోన్ మండలాలను గుర్తించామన్నారు. మే 3 వరకు మండలాల మధ్య రాకపోకలపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. అధికారులు, ఉద్యోగులు మండలాల్లోనే ఉండి పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు వ్యకిగత దూరం పాటించి విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: