ETV Bharat / state

గుంటూరు జిల్లాలో 48 గంటల్లో 31 కేసులు - గుంటూరులో కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. వైరస్ కట్టడికి అధికారులు చర్యలు చేపడుతున్నా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మొత్తం 89 మందికి ఈ మహమ్మారి సోకింది. అప్రమత్తమైన యంత్రాగం కఠిన చర్యలు అమలు చేస్తోంది. నిత్యావసరాల పంపిణీపైనా ఆంక్షలు విధించింది.

corona
corona
author img

By

Published : Apr 13, 2020, 12:43 AM IST

Updated : Apr 13, 2020, 3:27 AM IST

గుంటూరులో కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి జిల్లాలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 89కి చేరింది. రెండు రోజుల్లోనే 31 కేసులు నమోదయ్యాయి. ఆదివారం సాయంత్రం వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసే సమయానికి ఏడు కేసులే నమోదయ్యాయి. ఆ తర్వాత మరో ఏడుగురికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యినట్లు గుంటూరు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. వీరిలో ఒకే ఇంట్లో నలుగురు బాధితులు ఉన్నారు. ఈ ఏడు కేసులను వైద్య, ఆరోగ్యశాఖ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. గుంటూరులో ఒకరి మృతితో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఓ వైపు జిల్లా యంత్రాంగం రెడ్ జోన్ల ఏర్పాటు, పూర్తిస్థాయి లాక్ డౌన్ విధింపు వంటి చర్యలు చేపడుతున్నప్పటికీ పాజిటివ్ కేసుల తాకిడి పెరుగుతూనే ఉంది. దిల్లీ వెళ్లి వచ్చినవారు, వారిని కలిసిన వారు ఎక్కువమంది వైరస్ బారినపడ్డారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా నిన్న గుంటూరులో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించగా... ఇకపై రోజు విడిచి రోజు నిత్యావసరాల అమ్మకాలను చేపట్టాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది.

గ్రామీణంలోనూ కేసులు

గుంటూరు తూర్పు నియోజకవర్గంతోపాటు పశ్చిమ నియోజకవర్గంలో పాజిటివ్ కొత్త కేసులు నమోదుతో అధికారులు అప్రమత్తమయ్యారు. దక్షిణ కోస్తా ఐజీ ప్రభాకరరావు కొరిటెపాడులోని కంటైన్మెంట్ జోన్ పరిధిలో క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించారు. అనుమానితులను ఎప్పటికప్పుడు గుర్తించి పరీక్షలకు పంపాలని సూచించారు. మరోవైపు గుంటూరు గ్రామీణ పరిధిలోనూ కేసులు పెరుగుతున్నాయి. మాచర్ల, అచ్చంపేటలో ఇప్పటికే పాజిటివ్ కేసులు బయటపడగా... పొన్నూరు, నరసరావుపేటలోనూ కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: చికిత్స చేస్తున్న వైద్యుడిపై ఉమ్మిన కరోనా ఉన్మా
ది

Last Updated : Apr 13, 2020, 3:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.