గోల్డ్ బులియన్ మార్కెట్ పేరుతో.. కోట్ల విలువైన నకిలీ బిల్లులు సృష్టించిన ముఠా గుట్టురట్టు చేసింది విశాఖ జీఎస్టీ నిఘా విభాగం. గుంటూరు, మంగళగిరి పరిసరాల్లోని వివిధ సంస్థల్లో జీఎస్టీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఏకంగా రూ.8 కోట్లు జీఎస్టీ రాయితీ పొందిన ముఠాను అధికారులు పట్టుకున్నారు. కీలకమైన వ్యక్తిని అరెస్ట్ చేశారు. సోదాల సందర్భంగా రూ.1.58 కోట్ల విలువైన బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు.
మరో ఘరానా మోసం...
ఇలాంటిదే మరో వ్యవహారానికి సంబంధించి... వ్యాపారం చేయకుండానే చేసినట్లు నకిలీ బిల్లులను ముఠా సృష్టించినట్టు అధికారులు గుర్తించారు. నకిలీ బిల్లులు సృష్టించి రూ.28 కోట్లు జీఎస్టీ రాయితీని అక్రమార్కులు పొందారు. నిందితులపై ఈనెలలో 7 కేసులు నమోదయ్యాయి. 32 బోగస్ సంస్థలు ఏర్పాటు చేసి రూ.400 కోట్ల వ్యాపారం చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించారు. పూర్తి వివరాలు తెలుసుకునేలా అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: