గుంటూరు జిల్లా నరసరావుపేటలోని పలు ఆయిల్ మిల్లులపై.. జిల్లా ఫుడ్ సేఫ్టీ, రెవెన్యూ, తూనికలు కొలతల శాఖల అధికారులు దాడులు చేశారు. ఆరు బృందాలుగా పలు ఆయిల్ మిల్లుల్లో దాడులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. సత్తెనపల్లి రోడ్డులోని కనకదుర్గ ఆయిల్ ఇండస్ట్రీస్ మిల్లులో.. సుమారు 480 లీటర్ల శనగనూనెను సీజ్ చేసినట్లు తెలిపారు.
దుకాణ యజమానిపై కేసు నమోదు చేసినట్లు.. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి గౌస్ మోహిద్దీన్ తెలిపారు. వేరు శనగనూనె ప్యాకెట్లపై ప్యూర్ అని రాసి ఉండకూడదనీ.. అందువల్లే శనగనూనెను సీజ్ చేసినట్లు వివరించారు. సీజ్ చేసిన నూనె శాంపిళ్లను హైదరాబాద్ ల్యాబ్‌కి పంపి పరీక్షలు చేయిస్తామని.. ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి: