ETV Bharat / state

బ్యానర్లు కట్టిన ఉద్యోగులు, జెండాలు ఎగరేసిన వాలంటీర్లు - ప్రభుత్వ లాంఛనాలతో వైసీపీ ప్రచార పర్వం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2023, 8:07 AM IST

Updated : Nov 10, 2023, 8:37 AM IST

Government Employees Participated in Why AP Needs Jagan Campaign: రాజకీయ పార్టీకీ, ప్రభుత్వానికి మధ్య ఉండాల్సిన హద్దులు ప్రభుత్వ అధికారులు, వైఎస్సార్సీపీ నేతలు చెరిపేశారు. రాష్ట్రంలో గురువారం రోజున 'ఏపీకి జగనే ఎందుకు కావాలంటే' పేరుతో చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వ సిబ్బంది, అధికార పార్టీ శ్రేణులు.. భుజం భుజం కలిపి నిర్వహించారు.

Government_Employees_Participated_in_Why_AP_Needs_Jagan_Campaign
Government_Employees_Participated_in_Why_AP_Needs_Jagan_Campaign
బ్యానర్లు కట్టిన ఉద్యోగులు, జెండాలు ఎగరేసిన వాలంటీర్లు - ప్రభుత్వ లాంఛనాలతో వైసీపీ ప్రచార పర్వం

Government Employees Participated in Why AP Needs Jagan Campaign : రాజకీయ పార్టీకీ, ప్రభుత్వానికి మధ్య ఉండాల్సిన హద్దులు ప్రభుత్వ అధికారులు, వైఎస్సార్సీపీ నేతలు చెరిపేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎవరు ఎమనుకున్నా పట్టించుకోకుండా ప్రభుత్వ అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు కలిసిప్రచార కార్యక్రమం (YSRCP Campaign Program) చేపట్టారు. సచివాలయ ఉద్యోగులు బ్యానర్లు కడితే గ్రామ వాలంటీర్లు (Village Volunteers) వైఎస్సార్సీపీ జెండాలు ఎగరేశారు.

YSRCP Campaign Program with Government Employees : రాష్ట్రంలో గురువారం రోజున 'ఏపీకి జగనే ఎందుకు కావాలంటే (Why AP Needs Jagan)' పేరుతో చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వ సిబ్బంది, అధికార పార్టీ శ్రేణులు.. భుజం భుజం కలిపి నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మండలాలు, పుర, నగరపాలక సంస్థల పరిధిలో కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల వివరాలతో, పూర్తిగా సర్కారు ఖర్చుతో రూపొందించిన డిస్ ప్లే బోర్డుల్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో వైఎస్సార్సీపీ నేతలు ఆవిష్కరించారు. ఎంపీడీఓలు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల కమిషనర్లు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా చోట్ల ప్రభుత్వ పథకాల లబ్దిదారుల్ని వాలంటీర్లు బలవంతంగా తీసుకొచ్చారు.

Volunteers Working as YSRCP Activists: వాలంటీర్లను పార్టీ కార్యకర్తల్లా వాడేసుకుంటున్న జగన్.. ఐప్యాక్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ..!

సమస్యలపై ప్రజాప్రతినిధులను ప్రశ్నించిన ప్రజలు : ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, శ్రీకాకుళం, చిత్తూరు, కడప జిల్లాల్లో చాలాచోట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి జై కొడుతూ గ్రామ వాలంటీర్లు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులను సమస్యలపై ప్రజలు ప్రశ్నించిన ఘటనలూ చోటు చేసుకున్నాయి.

ఏపీకి జగనే ఎందుకు కావాలిలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్ల ఉత్సాహం : స్వచ్ఛంద సేవ ముసుగులో అంతర్గతంగా వైఎస్సార్సీపీ సేవ చేస్తున్న వాలంటీర్లు ఈ కార్యక్రమంతో పూర్తిగా ముసుగు తీసేశారు. ''జగనే ఎందుకు కావాలంటే'లో భాగంగా గ్రామాల్లో వైఎస్సార్సీపీ జెండాలు ఎగురవేసేందుకు పార్టీ కార్యకర్తల కంటే గ్రామ వాలంటీర్లే ఎక్కువ ఉత్సాహం ప్రదర్శించారు. ఉమ్మడి చిత్తూరు, కడప, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో చాలాచోట్ల వాలంటీరే దగ్గరుండి కార్యక్రమం నిర్వహించారు.

'మళ్లీ జగనే ఎందుకు కావాలి' కార్యక్రమానికి ప్రభుత్వ ఉద్యోగులతో ప్రచారం - ప్రజాధనంతో కార్యక్రమాలు

వైఎస్సార్సీపీ నేతలు, గ్రామ పెద్దలతో నిర్వహించిన విందునూ ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సచివాలయాల ఉద్యోగులు క్రియాశీలకంగా వ్యవహరించారు. గ్రామ పెద్దలు ఎవరిని ఆ విందులకు పిలవాలో వాలంటీర్లతో కలిసే వైఎస్సార్సీపీ నాయకులు నిర్ణయించారు. తొలి రోజు జెండాలు ఎగుర వేసిన ఊళ్లలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే, చెప్పినట్లు వినే వైఎస్సార్సీపీ మద్దతుదారులు, సానుభూతిపరుల ఇళ్లకు వెళ్లి వైఎస్సార్సీపీ నాయకులు ప్రచారం చేయనున్నారు.

Jagannana Suraksha for YCP Campaign: ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి.. జగనన్న ఆరోగ్య సురక్షతో పార్టీ ప్రచారం ముమ్మరం చేయండి!

Last Updated : Nov 10, 2023, 8:37 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.