ETV Bharat / state

సమస్యల పరిష్కారానికి 'గుడ్ మార్నింగ్ తెనాలి'

'గుడ్ మార్నింగ్ తెనాలి' పేరిట ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, సమస్యలను పరిష్కరిస్తామని స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. పురపాలక సంఘం నూతన ఛైర్ పర్సన్​తో కలిసి పలు వార్డుల్లో ఆయన పర్యటించారు.

good morning thenali program implement for solve problems in thenali guntur district
గుంటూరు జిల్లా తెనాలిలో 'గుడ్ మార్నింగ్ తెనాలి' పేరిట ఓ కార్యక్రమం
author img

By

Published : Mar 19, 2021, 9:57 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలో 'గుడ్ మార్నింగ్ తెనాలి' పేరిట ఓ కార్యక్రమాన్ని రూపొందించి, పట్టణంలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. నూతనంగా ఎన్నికైన మునిసిపల్ ఛైర్​పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీమ్​తో కలిసి 21, 22, 23, 24 వార్డుల్లో పర్యటించారు.

ఆయా వార్డుల్లోని సమస్యలను అధ్యయనం చేసి, పట్టణంలోని అన్ని వార్డుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను పరిశీలిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గుర్తించిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని వెల్లడించారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇదీచదవండి.

ఏపీలో లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేయట్లేదు: ఎంపీ కనకమేడల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.