గుంటూరు నగరంలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను లాలాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 3.5 కేజీల గంజాయి, 3,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నగర శివారు కమ్మశేషయ్య మైదానంలో గత రాత్రి కొందరు వ్యక్తులు నల్ల సంచులు పట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు కనిపించారు. అనుమానంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా... నిందితులు విశాఖపట్నం లంబసింగి నుంచి గంజాయి తీసుకువచ్చి గుంటూరులో విక్రయిస్తున్నట్లు తేలిందని డీఎస్పీ సీతారామయ్య తెలిపారు.
ఏడుగురుని అరెస్టు చేయగా...వీరికి గంజాయి సరఫరా చేస్తున్న నందు అనే వ్యక్తి ప్రస్తుతం పరారిలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు గౌస్ భాషా, కుమార్ బాబు, విశాల్ కుమార్, హేమంత్ , మస్తాన్, ఇస్మాయిల్, భరత్‌లను కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ స్పష్టం చేశారు.
ఇదీచదవండి