గుంటూరు జిల్లా వినుకొండలోని ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి బ్లాక్ మార్కెట్‌కు మద్యం విక్రయిస్తున్న రెండు దుకాణాల సూపర్ వైజర్స్, సేల్స్ మెన్లను ఎక్సైజ్ అధికారులు ఆదుపులోకి తీసుకున్నారు. దుకాణాల నుంచి అధిక ధరలకు బ్లాక్ మార్కెట్‌కి మద్యాన్ని అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. పట్టుబడిన నలుగురిపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు.. విధుల నుంచి తొలగింపునకు జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.
ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న సూపర్ వైజర్స్, సేల్స్ మెన్లను వినుకొండ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేశారు. మొత్తం నలుగురిపై కేసు నమోదు చేసి.. విధుల నుంచి తొలగింపునకు జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.
ఇదీ చదవండి:
సీఎం జగన్‌పై కేసుల ఉపసంహరణ.. సుమోటోగా తీసుకుని హైకోర్టు విచారణ