ఐఐటీ ర్యాంకర్లను సత్కరించిన ప్రత్తిపాటి - గుంటూరు జిల్లా వార్తలు
ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో జాతీయస్థాయిలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభినందించారు. ప్రతి విద్యార్థిని సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరిలో చిలకలూరిపేట నుంచి 235, 1051, 1164, 2182, ఈడబ్ల్యూఎస్ కోటాలో 12, 92, 185, 482 ర్యాంకులు సాధించిన విద్యార్థులు యశస్వి, భానుతేజ, వెంకట్, లక్ష్మీ ప్రవల్లిక, చంద్రమౌళి, మౌనికను చిలకలూరిపేటలోని తన నివాస గృహంలో ప్రత్తిపాటి పుల్లారావు గురువారం అభినందించారు.
ప్రతి విద్యార్థిని సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైక్రోసాఫ్ట్, గూగుల్ కంపెనీలకు సీఈవోలుగా ఉన్న సత్య నాదెళ్ల, సుందర్ పిచ్చై లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు తెదేపా నాయకులు నెల్లూరి సదాశివరావు , తూబాటి శ్రీహరి , ఎస్ఎస్ సుభాని, షేక్ కరీముల్లా, ముద్దన నాగేశ్వరరావు, జవ్వాజి మదన్, బండారుపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: