NHRC Notices to TG DGP and Hyd CP: సంధ్య థియేటర్ ఘటనలో వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) నోటీసులు జారీ చేసింది. డిసెంబరు 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి న్యాయవాది రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ రావడం, పోలీసులు లాఠీఛార్జ్ చేయడం వల్లే తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిందని, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కమిషన్ సంధ్య థియేటర్ ఘటనపై సీనియర్ ర్యాంక్ పోలీసు అధికారితో విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
'రేవతి చనిపోయిందని థియేటర్లో నాకు చెప్పలేదు' - భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్
పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్ రిప్లై - ఆరు పేజీల లేఖలో ఏముందంటే!