పంచాయతీ ఎన్నికల వ్యవహారంపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగబద్ధంగా విధుల్లో పాల్గొనాలన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ స్ఫూర్తితో పని చేయాలని సూచించారు. ఉద్యోగులు ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరం లేదని...ప్రభుత్వం, ఎస్‌ఈసీని అడిగి రక్షణ ఏర్పాట్లు చూసుకోవాలన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జరిగిన అయోధ్య శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణం నిధి సమర్పణ కార్యక్రమంలో ఎల్వీ పాల్గొన్నారు.
ఇదీచదవండి