ETV Bharat / state

ఉరకేస్తున్న కృష్ణమ్మ... దిగువ ప్రాంతాల్లో అప్రమత్తం!

కృష్ణా నదికి ఎగువ నుంచి వచ్చిపడుతున్న వరదతో అధికారులు అప్రమత్తమయ్యారు. నాగార్జున సాగర్‌ జలాశయం గరిష్ఠ నీటిమట్టానికి చేరడంతో ఆ ప్రభావం పులిచింతలపై పడింది. వరద పరిస్థితిపై కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పులిచింతల ముంపుగ్రామాల్లో అధికారులు సహాయ, పునరావాస చర్యలు చేపట్టారు.

author img

By

Published : Aug 13, 2019, 12:48 PM IST

floods
కృష్ణా నదికి వచ్చిపడుతున్న వరద

శ్రీశైలం ఎగువ పరివాహక ప్రాంతంలో భారీ వరదలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆ ప్రభావంతో నాలుగురోజుల్లోనే నాగార్జున సాగర్ గరిష్ఠ నీటిమట్టానికి చేరువైంది. సాగర్ చరిత్రలో పదేళ్ల తర్వాత తొలిసారిగా మొత్తం 26 క్రస్ట్‌ గేట్లను ఎత్తివేశారు. దిగువకు పెద్దఎత్తున వరదనీటిని విడిచిపెట్టడంతో.. పులిచింతల ప్రాజెక్టుకు 3 లక్షలకు పైగా వరదనీరు వచ్చి చేరుతుంది. పులిచింతల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45 టీఎంసీలు కాగా.. క్రమంగా నీరు చేరుతుండటంతో వేగంగా ప్రాజెక్టు నిండుతోంది. ఈ పరిస్థితుల్లో ముంపు గ్రామాలపై అధికారులు దృష్టి పెట్టారు.

వరద పరిస్థితి దృష్ట్యా కృష్ణా జిల్లా పరిధిలో ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సంయుక్త కలెక్టర్ మాధవీలత టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నందున దిగువ ముంపు గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తం కావాలని హెచ్చరించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రధానంగా బెల్లంకొండ మండలంలోని గ్రామాలు ముంపు సమస్య ఎదుర్కొంటున్నాయి. వేమవరం, రేగులగడ్డ, వెల్లంపల్లి, ఎమ్మాజీగూడెం గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మాచవరం మండలంలోని లోతట్టు గ్రామాలు, 7 లక్షలకు పైగా ప్రవాహముంటే సమస్య ఎదుర్కొనే డెల్టా లంక గ్రామాలపైనా జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. వరదలపై అన్నివిధాలా పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ తెలిపారు.

గుంటూరు, తెనాలిలో వరదలపై కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలోతో పాటు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ ప్రత్యేక కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి...

గదులు 2.. తరగతులు 8..మరి టీచర్లు?

Intro:ap_atp_56_13_mpdo_darna_av_ap10099
date:13-08-2019
center:penu konda
contributor:c.a.naresh
cell:9100020922
EMP ID :AP10099
హరితరాయబారులకు వేతనాలు చెల్లించాలని కార్మికుల దర్నా
అనంతపురం జిల్లా పెనుకొండ లోని మండల పరిషత్ కార్యాలయం వద్ద హరిత రాయబారులు గత తొమ్మిది నెలలుగా వేతనాలు చెల్లించలేదని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు బకాయి పడిన వేతనాలను వెంటనే చెల్లించాలని కార్యాలయ సిబ్బందిని ఎంపీడీవో శివశంకరప్పను కార్యాలయంలోకి పోనీయకుండా కార్యాలయం గేటు ముందు అడ్డుకున్నారు కార్మికులకు వేతనాలు చెల్లించి హరిత రాయబారులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న తదితరులు పాల్గొన్నారు

Body:ap_atp_56_13_mpdo_darna_av_ap10099

Conclusion:9100020922

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.