ETV Bharat / state

గుంటూరులో 7వ రౌండ్ ఫీవర్ సర్వే ప్రారంభం - గుంటూరులో 7వ రౌండ్ ఫీవర్ సర్వే ప్రారంభం లేటెస్ట్ న్యూస్

గుంటూరు జిల్లాలో ఫీవర్ సర్వే 7వ రౌండ్ ప్రారంభించినట్లు సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ పేర్కొన్నారు. ఈ సర్వేల ద్వారా కొవిడ్ వైరస్ సూచనలు ఉన్న పేషెంట్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో పాజిటివ్​గా నిర్ధరణ అయితే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి హెల్త్ కేర్ సెంటర్​కు కాని, హోమ్ ఐసోలేషన్​లో కాని వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

fever survey
fever survey
author img

By

Published : May 19, 2021, 7:19 PM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో.. హెల్త్ కమిషనర్ ఆదేశాల ప్రకారం గుంటూరు జిల్లాలో ఫీవర్ సర్వే 7వ రౌండ్ ప్రారంభించినట్లు సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆరు రౌండ్లు విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. తెనాలి డివిజన్ పరిధిలో ఇప్పటివరకూ 6 రౌండ్లు పూర్తి చేసుకుని 7వ రౌండ్లో 80 శాతం సర్వే పూర్తి అయినట్లు తెలిపారు. ఈ సర్వేల ద్వారా కొవిడ్ వైరస్ సూచనలు ఉన్న పేషెంట్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో పాజిటివ్​గా నిర్ధరణ అయితే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి హెల్త్ కేర్ సెంటర్​కు కాని, హోమ్ ఐసోలేషన్​లో కాని వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి కానీ తరలిస్తున్నట్లు వివరించారు. హోమ్ ఐసోలేషన్​లో ఉంటున్న వారికి.. కొవిడ్ కిట్టును కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 6న రౌండు ఫీవర్ సర్వేలో 2 వేల మందికి సర్వే చేయగా.. 800 మంది అనుమానితులకు టెస్టులు చేశామని పేర్కొన్నారు. వారిలో 165 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యిందని వివరించారు. వీరిలో కొంతమంది హోమ్ ఐసోలేషన్​కు అనుమతించగా.. మరికొందరిని కొవిడ్ హెల్తే కేర్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. 8, 9, 10 రౌండ్ లను మరో పది రోజుల్లో పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ వివరించారు. ప్రతిరోజు ఈ సర్వేలలో ఆయా మండల పరిధిలోని ఎంపీడీవో, ఎమ్మార్వోలు ఫీల్డ్​కు వెళ్లి సర్వేలను స్వయంగా పర్యవేక్షించే విధంగా నిర్దేశించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: 4 జిల్లా ఆస్పత్రుల్లో.. సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ యంత్రాలు ప్రారంభించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.