ఇదీ చదవండి : '6 లక్షల మందికి 400 కోట్ల నిధులా..? ఇదెక్కడి న్యాయం'
" రావణ పాలనకు నిదర్శనం జగన్ పరిపాలన" - ex minister devineni uma comments on cm jagan
దైవకార్యాల్లో నియమనిబంధనలను ఉల్లంఘించి, భక్తుల మనోభావాలను సీఎం జగన్మోహన్రెడ్డి దెబ్బతీస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
సీఎం గారు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు
భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తెదేపా కార్యాలయం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి దేవినేని.... దైవకార్యాల్లో నియమనిబంధనలు ఉల్లంఘించే హక్కు ఎవరిచ్చారంటూ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ముఖ్యమంత్రి శేషవస్త్రాలు సమర్పించేటప్పుడు సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. శరన్నవరాత్రిల్లో కనకదుర్గ అమ్మవారికి మూలా నక్షత్రం రోజు సమర్పించాల్సిన బట్టలను, దిల్లీ పర్యటన ఉందని ముందుగానే సమర్పించటమేటని ప్రశ్నించారు. ఇదే రావణ పాలనకు నిదర్శనమంటూ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. వైకాపా అరాచకాలతో ఓ మహిళా ఎంపీడీఓ రోడెక్కి నిరసనకు దిగినా పోలీసులు పట్టించుకోరా అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో ఉన్న 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిచాల్సిన ప్రభుత్వం, ఆ సంఖ్యను గణనీయంగా తగ్గించేసిందని ఆరోపించారు. పక్క రాష్ట్రాలకు రైతుల ప్రయోజనాలు తాకట్టు పెడుతుంటే సహించబోమని దేవినేని ఉమ హెచ్చరించారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడే పోలవరం ఎత్తు తగ్గింపునకు కుట్ర పన్నుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర జలాశయాల్లో నీరు నిల్వ ఉంచే అవకాశం ఉన్నా అసమర్థతతో సముద్రంలోకి వదిలేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి : '6 లక్షల మందికి 400 కోట్ల నిధులా..? ఇదెక్కడి న్యాయం'
sample description