Aqua Bids: మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఫిష్ ఆంధ్రా అవుట్ లెట్లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రుల సాధికారిక కమిటీ స్పష్టం చేసింది. సచివాలయంలో ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు, విక్రయాలు, ఆక్వా ఫీడ్, సీడ్ సరఫరాపై సాధికారిక కమిటీ సమీక్ష నిర్వహించింది. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు సహా అధికారులు హాజరయ్యారు. మార్చి నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల ఫిష్ ఆంధ్రా అవుట్ లెట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దేశీయ మార్కెట్లోనూ ఏపీ ఆక్వా ఉత్పత్తులు విరివిగా విక్రయించేలా చర్యలు చేపట్టాలని కమిటీ అధికారులను ఆదేశించింది.
రాష్ట్రంలో అక్వా ఉత్పత్తుల వినియోగం గణనీయంగా పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా సాధికారిక కమిటీ ఆదేశించింది. వివిధ ప్రాంతాల్లో ఆక్వా ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించాలని సూచనలు జారీ చేసింది. ఆక్వా సీడ్, ఫీడ్ రేట్లపై ఇకపై నిరంతరం ప్రభుత్వ పర్యవేక్షణ ఉండేలా కార్యాచరణ చేపట్టాల్సిందిగా మంత్రుల కమిటీ అధికారులకు సూచించింది. దేశీయ మార్కెట్లోనూ ఏపీ ఆక్వా ఉత్పత్తులు విరివిగా విక్రయించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఆక్వా సీడ్, ఫీడ్ రేట్లను శాస్త్రీయంగా నిర్ణయించేందుకు మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని మంత్రుల సాధికారిక కమిటీ పేర్కొంది.
ఇవీ చదవండి: