ETV Bharat / state

Casino: క్యాసినో వ్యవహారం.. కీలక ఆధారాలు సేకరించిన ఈడీ - చికోటి ప్రవీణ్​పై ఈడీ దర్యాప్తు

Chikoti Praveen: క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. నాలుగు రోజులపాటు చికోటి ప్రవీణ్‌ను విచారించిన ఈడీ.. పలు వివరాలు సేకరించింది. ప్రవీణ్‌, అతని కుటుంబ సభ్యులు, డైరెక్టర్ల కంపెనీలపై ఈడీ ఆరా తీస్తోంది.

casino
chikoti praveen
author img

By

Published : Aug 8, 2022, 10:10 PM IST

Chikoti Praveen: క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు చికోటి ప్రవీణ్​ను విచారించిన ఈడీ అధికారులు అతని వద్ద నుంచి కీలక ఆధారాలు సేకరించారు. చికోటి ప్రవీణ్ ఇచ్చిన వివరాలను విశ్లేషిస్తున్నారు. విచారణలో గత పదేళ్లుగా విదేశీ ప్రయాణ వివరాలు ఈడీ అధికారులు సేకరించారు.

ఇప్పటి వరకూ ఫైల్ చేసిన ఆదాయపు పన్ను వివరాలు సేకరించిన ఈడీ అధికారులు.. చికోటి ప్రవీణ్​తో పాటు అతని బంధువుల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు. ప్రవీణ్​తో పాటు అతని కుటుంబ సభ్యులు డైరెక్టర్లు, భాగస్వాములుగా ఉన్న కంపెనీల వివరాలపై ఈడీ ప్రశ్నించింది. స్తిర, చరాస్థుల వివరాలు సేకరించింది. పాస్​పోర్ట్ వివరాలు తీసుకున్న ఈడీ ఆధికారులు విదేశీ ప్రయాణ వివరాలను విశ్లేషిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.