ETV Bharat / state

ఇంటి ప్రాంగణాన్నే చిట్టడవిగా మార్చిన వైద్యుడు - guntur latest news

ఆ ఇంట్లోకి ప్రవేశించగానే పచ్చదనం స్వాగతం పలుకుతుంది. ఆహ్లాదాన్నిచ్చే మొక్కలు ఆకాశం నుంచి ఆశీర్వదించే చెట్లూ ఉంటాయక్కడ. రంగురంగుల పూలమొక్కలు, పక్షుల కిలకిలరావాలు మనసుకు హాయినిస్తాయి. గంటూరులో ఓ వైద్యుడు తన ఇంటి ప్రాంగణాన్ని చిట్టడివిలా మార్చిన తీరు చూడముచ్చటగా ఉంది.

doctor making gardening in guntur
ఇంటి ప్రాంగణాన్నే చిట్టడవిగా మార్చిన వైద్యుడు
author img

By

Published : Jun 27, 2021, 4:48 PM IST

నగరాలు కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన తరుణంలో ఇంటి చుట్టూనే అడవిని పెంచిన ఈ పెద్దాయన పేరు రత్నబాబు. వృత్తి రీత్యా ఎముకలు, కీళ్ల వైద్యుడైన రత్నబాబుకు మొక్కలంటే మక్కువ. ఇంటి చుట్టూ అనేక పూలు, అలంకరణ మొక్కలను పెంచుతున్నారు. విదేశాల నుంచీ మొక్కలు తెచ్చి పోషిస్తున్నారు. ఎడారి మొక్కలు, మరుగుజ్జు మొక్కలతో పాడు ఎత్తైన టేకు, మామిడి, నేరేడు వంటి 150 రకాల చెట్లు రత్నబాబు పెరట్లో దర్శనమిస్తాయి. సీజన్‌లలో మాత్రమే దొరికే పండ్లన్నీ వీరి ప్రాంగణంలో కాస్తాయి.

ఇంటి ప్రాంగణాన్నే చిట్టడవిగా మార్చిన వైద్యుడు

మొక్కల పెంపకంతో రోజంతా పని చేసిన శ్రమ ఇట్టే మాయమవుతుందంటారు రత్నబాబు. పుష్పాలు పూసినా, కాయలు కాసినా ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్తారు. చెట్ల నరికివేతను రత్నబాబు వ్యతిరేకిస్తారు. చెట్లను కాపాడుకోవాలనే ఆలోచన వచ్చేలా లీవ్ మీ ఎలోన్ అన్న నినాదంతో ఉన్న బొమ్మల్ని పెరట్లో ఉంచారు. కొన్ని రకాల కూరగాయల్ని కూడా పెంచుతున్న ఆయన ఇంటి అవసరాల కోసం వాటినే వినియోగిస్తారు. చెట్ల నుంచి రాలిపడిన ఆకులు, పూలు ఇతర వ్యర్థాల నుంచి తయారుచేసిన ఎరువునే మొక్కల పెంపకానికి ఉపయోగిస్తారు రత్నబాబు. ఇలా కొన్నేళ్లుగా మొక్కల పెంపకం ద్వారా పచ్చదనం పరవళ్లు తొక్కిస్తున్నారు.

ఇదీచదవండి

MAA elections: 'మా' ఎన్నికలపై మంచు విష్ణు బహిరంగ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.