ETV Bharat / state

AP Police System: వైఎస్సార్​సీపీ పాలనలో పాతాళంలోకి ఏపీ పోలీసు వ్యవస్థ.. - AP Latest News

Performance of Police System in YCP Govt: రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్ల పాటు పనితీరు, మౌలికవసతుల కల్పనలో తెలంగాణతో పోటీపడిన ఆంధ్రప్రదేశ్‌ పోలీసు విభాగం.. వైఎస్సార్​సీపీ పాలనలో బాగా నీరసించిపోయింది. ఆధునికతకు పెద్దపీట వేసి తెలంగాణ పోలీసులు దూసుకెళ్తుంటే.. నానాటికీ తీసుకట్టుగా ఏపీ పోలీసు విభాగం.. వెలవెలబోతోంది. సాంకేతిక హంగులు, మౌలిక వసతులతో తెలంగాణ పోలీస్‌ రాణిస్తుంటే.. ప్రతిపక్షాలపై కక్షసాధింపు, రాజకీయ వేధింపులకే ఏపీ పోలీసు విభాగం పరిమితమైంది.

AP Police System
పోలీసు వ్యవస్థను పాతాళంలోకి తొక్కిన వైసీపీ ప్రభుత్వం.. పక్క రాష్ట్రంలో దూసుకుపోతున్న వైనం
author img

By

Published : Jul 25, 2023, 7:40 AM IST

Updated : Jul 25, 2023, 8:21 AM IST

వైఎస్సార్​సీపీ పాలనలో పాతాళంలోకి ఏపీ పోలీసు వ్యవస్థ..

Difference between AP and Telangana police: తెలంగాణ పోలీస్‌ పేరు చెబితే చాలు.. ఆధునిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్.. వీధుల్లో ప్రతి ఒక్కరి కదలికను గమనించే లక్షల సీసీ కెమెరాలు, స్మార్ట్‌ పోలీస్‌ స్టేషన్లు, కొత్త వాహనాలు, సైబర్‌నేరాలు, మాదకద్రవ్యాలు అరికట్టేందుకు.. ప్రత్యేక విభాగాలు టక్కున గుర్తుకొస్తాయి. అదే ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ విభాగం పేరు చెబితే.. వైఎస్సార్​సీపీ ప్రత్యర్థులు, ప్రతిపక్షాలపై రాజకీయ వేధింపులు, కక్షసాధింపు చర్యలు.. అక్రమ కేసులు, అరెస్టులు, ప్రశ్నించే, హక్కుల కోసం నినదించే గొంతుల అణచివేతలే.. కళ్లముందు కదలాడతాయి. నాలుగేళ్ల వైఎస్సార్​సీపీ పాలనలో పోలీసింగ్‌ మొదలుకొని వసతులు, సీసీ కెమెరాల ఏర్పాటు వరకూ అన్నింటిలోనూ.. ఏపీ రివర్స్‌లో నడుస్తోంది. తెలంగాణ పోలీసులు.. సాంకేతిక హంగులు, మౌలిక వసతులు సమకూర్చుకుని.. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా అభివృద్ధి చెందుతుంటే ఏపీ పోలీసు విభాగం నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది.

వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక మొత్తం రివర్స్‌.. జగన్‌ ప్రభుత్వం.. కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు సరికదా.. గతంలో ఉన్నవీ తగ్గించేసింది. కొత్త వాహనాలు కొనుగోలు చేయక.. పాతవాటితోనే నెట్టుకురావాల్సి వస్తోంది. నాలుగేళ్లుగా ఒక్క పోలీసు ఉద్యోగాన్నీ భర్తీచేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం హయాంలో.. మొదటి అయిదేళ్లు.. అభివృద్ధి విషయంలో ఏపీ పోలీసు శాఖ తెలంగాణ పోలీసు విభాగంతో పోటాపోటీగా ప్రయాణించింది. అదే వేగం, అదే చొరవ కొనసాగించి ఉంటే.. ఏపీ పోలీసు విభాగం ఈ పాటికే అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకుని.. మెరుగుపడేది. కానీ వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక.. మొత్తం రివర్స్‌ అయ్యింది. గత నాలుగేళ్లుగా ప్రతిపక్ష పార్టీలను వేధించటానికే పోలీసు శాఖను వినియోగించుకుంటున్న జగన్‌ ప్రభుత్వం.. ఏపీ పోలీసు విభాగం బలోపేతంపై.. కనీస స్థాయిలో దృష్టిసారించలేదు. ఏపీలో ఉన్నది 95శాతం రాజకీయ పోలీసింగే. వైఎస్సార్​సీపీ నేతలు చెప్పినట్లు నడుచుకుంటేనే.. ఏపీలో అధికారులు, సిబ్బంది తమ స్థానాల్లో కొనసాగుతారు. లేదంటే శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే.

ఏపీలోని సీసీ కెమేరాలు 14,770 మాత్రమే.. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అంతటా.. సీసీ కెమెరాలు ఏర్పాటుచేసింది. 150 కోట్లతో రెండు విడతల్లో.. పోలీసు వాహనాలు కొనుగోలు చేసింది. మంగళగిరిలో పోలీసు ప్రధాన కార్యాలయం, టెక్‌ టవర్‌.. నిర్మించింది. పలు ప్రాంతాల్లో మోడల్‌ పోలీసుస్టేషన్లను నిర్మించింది. రెండు విడతల్లో పోలీసు నియామకాలు చేపట్టింది. రాష్ట్రస్థాయి ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నిర్మాణానికి.. శంకుస్థాపన చేసింది. వైసీపీ వచ్చాక అలాంటి చర్యలేవీ లేకుండా పోయాయి. ఏపీలో 2021 జనవరి 1 నాటికి 20 వేల 968 సీసీ కెమెరాలు ఉండగా..2022 జనవరి 1 నాటికి వాటి సంఖ్య 14 వేల 770కి.. తగ్గిపోయింది. ఏడాదిలో 6,198 సీసీ కెమెరాలు తగ్గిపోయాయి. గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన వాటినీ సరిగ్గా నిర్వహించట్లేదు. పాడైనవాటికి మరమ్మతులు చేయట్లేదు. ఫలితంగా వేల కెమెరాలు మూలకుచేరాయి. విశాఖలో 2,900 సీసీ కెమెరాలే ఉండగా.. 400కు పైగా పనిచేయట్లేదు. విజయవాడలో 2,500 కెమెరాలకు.. దాదాపు 600 పడకేశాయి.అన్ని ప్రధాన పట్టణాల్లోను ఇదే పరిస్థితి.

తెలంగాణలో 2,82,558 సీసీ కెమెరాలు.. బీపీఆర్‌డీ గణాంకాల ప్రకారం.. తెలంగాణలో ఉన్న సీసీ కెమెరాలతో పోలిస్తే ఏపీలో ఉన్నవి 5 శాతమే. నేరగాళ్ల కదలికలు పసిగట్టడానికి, కేసుల ఛేదనకు సీసీకెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి. అయినా జగన్‌ ప్రభుత్వానికి ఆ ధ్యాసే లేదు. దేశంలో అత్యధికంగా తెలంగాణలో 2,82,558 సీసీ కెమెరాలున్నాయి. 2021లో సర్ప్‌ షార్క్‌ సంస్థ సర్వే ప్రకారం ప్రతి చదరపు కిలోమీటరుకు.. 480, ప్రతి వెయ్యి జనాభాకు 30 చొప్పున సీసీ కెమెరాలతో.. హైదరాబాద్‌ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. 2020లో కంపేర్‌టెక్‌ సంస్థ చేసిన సర్వే ప్రకారం అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల్లో.. హైదరాబాద్‌ ప్రపంచంలోనే 16వ స్థానంలో ఉంది. గతేడాది సీసీ కెమెరాల ద్వారానే.. తెలంగాణలో 18,234 కేసులు ఛేదించారు.

పాత వాహనాలే దిక్కు.. జగన్‌ ఏలుబడిలో పోలీసులు పాత వాహనాలతోనే నెట్టుకొస్తున్నారు. గతేడాది మార్చిలో దిశ పేరిట గస్తీ కోసం ద్విచక్ర వాహనాలను, 163 కార్లను పోలీసు శాఖకు ఇచ్చింది. అవి మినహా పోలీసుల కోసం వాహనాలేవీ కొనలేదు. వీలైనంత వేగంగా ఘటనా స్థలానికి చేరుకోవడానికి.. పోలీసులకు మంచి వాహనాలు ఉండాలి. కానీ జగన్‌ ప్రభుత్వానికి అవేవీ పట్టట్లేదు. తెలుగుదేశం హయాంలో 2015లో 100 కోట్లతో 2,422 వాహనాలు, 2018లో 50 కోట్లతో 1,400 వాహనాలను కొన్నారు. అవీ లేకపోతే.. ఏపీ పోలీసు విభాగం ఇప్పుడు చాలా ఇబ్బంది పడేది. ప్రస్తుతం ఏపీ పోలీసు శాఖ వద్ద 9 వేల 753 వాహనాలున్నాయి.

అధునాతన వాహనాలతో తెలంగాణ పోలీసులు.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ముందుగా దృష్టి సారించిందే పోలీసుశాఖపై కావడంతో.. అధునాతన హంగులతో కూడిన వాహనాలు వచ్చాయి. ఇప్పటివరకు.. కొత్తగా వెయ్యికిపైగా పెట్రోలింగ్‌ కార్లు, 2100కు పైగా బ్లూకోల్ట్స్‌ వాహనాలను తెలంగాణ పోలీసులు సమకూర్చుకున్నారు.

భర్తీకి నోచుకోని 17,385 పోస్టులు.. ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల్ని.. రాబోయే నాలుగేళ్ల పాటు భర్తీచేస్తామని 2020 అక్టోబరులో చెప్పిన సీఎం జగన్‌.. ఇంతవరకూ ఒక్క పోలీసు ఉద్యోగమూ ఇవ్వలేదు. 6,511 ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ కోసం గతేడాది నవంబరులో నోటిఫికేషన్‌ జారీచేసినా.. మోక్షం కలగలేదు. ప్రాథమిక రాతపరీక్ష ఫలితాలు విడుదలై ఆరు నెలలు గడుస్తున్నా.. అర్హులకు ఇప్పటివరకూ దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన 1.53 లక్షల మందికి.. నిరీక్షణ తప్పట్లేదు. మరోవైపు ఏపీ పోలీసుశాఖను.. సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుతం 17,385 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

తెలంగాణలో 45,225 పోలీసు ఉద్యోగాలు భర్తీ.. తెలుగుదేశం హయాంలో 2016లో.. 5,348 పోస్టులు భర్తీచేశారు. 2018లో 3,137 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చి.. నియామక ప్రక్రియ మొత్తం 2019 ఫిబ్రవరికే పూర్తిచేశారు. అప్పట్లో ఎన్నికల కోడ్‌ రావటంతో.. ఫలితాల వెల్లడి నిలిచిపోయింది. జగన్‌ అధికారంలోకి వచ్చిన కొన్నిరోజుల్లో.. ఈ ఫలితాలు విడుదల చేసి అప్పట్లో అర్హత సాధించిన వారికి పోస్టింగులిచ్చారంతే. తెలంగాణ ప్రభుత్వం.. 2015లో 9,281.. 2018లో 18,428 పోలీసు ఉద్యోగాలను.. భర్తీ చేసింది. 2022లో 17 వేల 516 పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తైంది. ఈ నెలలోనే తుది ఫలితాలు విడుదల చేయనున్నారు. దీంతో కలిపితే తెలంగాణలో మొత్తంగా.. 45,225 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసినట్లవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో 90 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నారు.

సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేయని వైఎస్సార్​సీపీ ప్రభుత్వం.. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ దిశగా అవసరమైన అధునాతన సాంకేతిక వ్యవస్థలను వేటినీ ఈ నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన వ్యవస్థలనైనా సద్వినియోగం చేసుకోవట్లేదు. తెలుగుదేశం హయాంలో సీఎంఓలోనే రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ పేరిట రాష్ట్రస్థాయి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. మంగళగిరిలో నిర్మించిన టెక్‌టవర్‌కు అన్ని పోలీసు యూనిట్లలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాల్ని.. అనుసంధానించారు. ఏపీలో ఎక్కడ ఏం జరిగినా ఇక్కడి నుంచి పర్యవేక్షించేందుకు.. ఏర్పాట్లు చేశారు. వైసీపీ వాటిని అభివృద్ధి చేయడం అటుంచి కనీసం సద్వినియోగం చేసుకోవట్లేదు.

తెలంగాణలో అత్యాధునిక భవనాలు.. హైదరాబాద్‌లో 600 కోట్లతో.. ఆధునిక రాష్ట్ర స్థాయి పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను నిర్మించారు. దేశంలో మరెక్కడా ఇలాంటి వ్యవస్థ లేదు. ఇందులో.. 5 టవర్లు ఉంటాయి. తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని సీసీ కెమెరాలనూ.. ఈ కేంద్రం నుంచే పర్యవేక్షించొచ్చు.

నేరాలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌.. గంజాయి సాగు, వినియోగం, సరఫరా, రవాణాకు ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా మారింది. 2021లో ఏపీలో పట్టుకున్నంత గంజాయి మరే రాష్ట్రంలోనూ స్వాధీనంచేసుకోలేదని నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో.. నివేదిక స్పష్టం చేసింది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో- సెబ్ ఈ బాధ్యతలు చూస్తున్నా.. మాదకద్రవ్యాలను అరికట్టే ప్రత్యేక విభాగాలు లేవు. ఏపీలో సైబర్‌ నేరాలు.. రోజురోజుకూ పెరుగుతున్నాయి. రుణయాప్‌లు, ఆన్‌లైన్‌ గేమ్‌ల బారిన పడి సామాన్యులు.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మహిళలపై సైబర్‌ వేధింపులు ఎక్కువయ్యాయి. అయినా వాటిని అరికట్టడంపై.. శ్రద్ధ లేదు. సీఐడీలోని సైబర్‌ నేరాల విభాగమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో.. పోస్టులు పెట్టినవారిని వేధించేందుకు, వారిపై అక్రమ కేసులు బనాయించేందుకే.. పరిమితమైంది.

తెలంగాణలో 130 మంది నిపుణులైన సిబ్బంది.. సైబర్‌ నేరగాళ్ల ఆట కట్టించేందుకు, మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు.. తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా టీఎస్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, యాంటీ నార్కోటిక్‌ బ్యూరోలు ఏర్పాటు చేసుకున్నారు. 130 మంది నిపుణులైన సిబ్బంది..ఈ బ్యూరోలో పనిచేస్తున్నారు.

అద్దె భవనాల్లో పోలీసుస్టేషన్లు.. వైసీపీ ప్రభుత్వం పోలీసు శాఖకు అవసరమైన భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన గురించి పట్టించుకోలేదు. కొత్త జిల్లాల్లో.. పోలీసు ప్రధాన కార్యాలయాలకు సొంత భవనాల్లేవు. పలుచోట్ల పోలీసుస్టేషన్లు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. తెలంగాణలో పోలీసుస్టేషన్లు, కార్యాలయాలు కార్పొరేట్‌ తరహాలో రూపుదిద్దుకున్నాయి.

ఈవ్‌టీజింగ్​ను పట్టించుకోని వ్యవస్థ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన సమస్యల్లో ఈవ్‌టీజింగ్‌ ఒకటి. రోడ్లు, బహిరంగ ప్రదేశాలు, బస్టాండ్లు, ప్రజారవాణా వాహనాల్లో.. యువతులు, మహిళలను వేధించేవారి ఆట కట్టించేందుకు ఏపీ పోలీసు విభాగం ప్రత్యేకవిభాగాలు, బృందాల్ని ఏర్పాటు చేయలేదు. మహిళా పోలీసుల్ని మఫ్టీలో ఉంచి ఇలాంటి ఆకతాయిలను గుర్తించి పట్టుకోవటం లాంటి.. చర్యల్లేవు. దీంతో ఆకతాయిలు మరింత రెచ్చిపోతున్నారు.

తెలంగాణలో షీ టీమ్స్‌.. ఆకతాయిల ఆటకట్టించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగమే షీ టీమ్స్‌. పౌరులతో కలిసిపోయి ఉండే షీ టీమ్స్‌ పోలీసులు.. మహిళలను వేధిస్తున్నవారిని గుర్తించి, అదుపులోకి తీసుకుంటారు. ఇలాంటి ప్రయోగం దేశంలోనే ప్రథమం.

పోలీసు అకాడమీ లేని పరిస్థితి.. కొత్తగా నియమితులైన ఎస్సైలు, డీఎస్పీలు, ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్తలు అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, ఇతర పోలీసు అధికారులకు అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు.. అవసరమైన ఆంధ్రప్రదేశ్‌ పోలీసు ఎకాడమీ-అప్పా.. ఇప్పటికీ ఏపీకి పూర్తిస్థాయిలో సమకూరలేదు. అనంతపురంలోని పోలీసు శిక్షణ కేంద్రాన్నే అప్పాగా మార్చి.. ప్రస్తుతం అక్కడే శిక్షణ ఇస్తున్నారు. అక్కడ రాష్ట్రస్థాయి అకాడమీకి సరిపడా మౌలిక వసతులు, సదుపాయాలు లేవు. అయినా కొత్తగా అప్పాను నెలకొల్పాలన్న ధ్యాసే..జగన్‌ ప్రభుత్వానికి లేదు.

Last Updated : Jul 25, 2023, 8:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.