Grama Sachivalayam Topic In Parlament: గ్రామ సచివాలయ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలుచేసే ప్రతిపాదనేమీ తమ వద్ద లేదని.. కేంద్రం స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయమంత్రి నిరంజన్ జ్యోతి పార్లమెంటుకు తెలియజేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహించిన సమీక్షలో.. ప్రభుత్వ సేవలు అందించడానికి ప్రతి 2వేల మందికి ఒకటి చొప్పున ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ గురించి.. సీఆర్ఎం నివేదికలో పేర్కొన్నట్లు సమాధానంలో తెలిపారు. వీటిని దేశ వ్యాప్తంగా అమలుపై.. వైసీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరిలు పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా బదులిచ్చారు. ప్రస్తుతానికి ఆ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రతిపాదనేదీ లేదన్నారు.
ఇవీ చదవండి: