విద్యుదాఘాతంతో ముత్యం సుబ్రమణ్యం అనే యువకుడు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలోని లా మండల కేంద్రమైన చేబ్రోలులో జరిగింది. చాకలి పేటలో శంకర్‌కు చెందిన నూతన ఇంటి నిర్మాణం జరుగుతోంది. సుబ్రమణ్యం మరుగుదొడ్డి నుంచి నీళ్ళు బయటకు పోయేందుకు పైపులైను అమరుస్తున్నారు. పైపుల అమరికకు అడ్డుగా గోడ రావటంతో దానికి విద్యుత్ యంత్రం పరికరంతో కన్నం చేసేందుకు ప్రయత్నించాడు. విద్యుత్ వాహినిలో విద్యుత్ ప్రసారం కాకపోవడంతో స్విచ్ ఆపకుండానే మరమ్మతులు నిర్వహిస్తుండగా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందాడు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి చదవండి...ప్రేమజంట ఆత్మహత్యాయత్నం- ప్రియుడు మృతి