గుంటూరు నగరంలో బైక్, ఇతర వాహనాలకు పోలీస్ సైరన్లు బిగించుకొని రద్దీ ప్రదేశాలలో వాటిని మోగిస్తూ... కొంతమంది ఆకతాయిలు ప్రజలకు ఇబ్బంది కలుగజేస్తున్నారు. స్థానిక ప్రజలు ఈ కుర్రకారుల ఫోటోలు, వీడియోలను తీసి వాట్సాప్ ద్వారా ట్రాఫిక్ డీఎస్పీకి పంపారు. అప్రమత్తమైన అధికారులు 5 వాహనాలను సీజ్ చేసి, వాహనదారులపై క్రిమినల్ కేసులు బనాయించారు. ఈ వాహనాలకు పోలీస్ సైరన్లు బిగించిన షాప్ ఓనర్లకు నోటీస్లు ఇచ్చి కేసులలో ముద్దాయిలుగా చేర్చారు. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు పోలీస్, అంబులెన్స్ సైరన్ బిగించుకొని వాటిని మోగిస్తూ నడపవద్దని ట్రాఫిక్ డీఎస్పీ కె.సుప్రజ పేర్కొన్నారు. ప్రజలు తమ దృష్టికి వచ్చిన ట్రాఫిక్ సమస్యలను ఫోటో లేదా వీడియో తీసి తమ ఫోన్ నెంబర్కి సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇదీ చూడండి: 'ఆహార కల్తీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'