గత ప్రభుత్వ హయాంలో టిడ్కో తరపున పేదల కోసం నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలే వాటిని స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించారు. గుంటూరు నగరపాలక సంస్థ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొన్న ఆయన వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయన్నారు. మరోవైపు లబ్ధిదారులు మాత్రం అద్దె ఇళ్లలో ఉంటున్నారని.. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లించటం భారంగా మారిందని వివరించారు. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ విషయం గుర్తించి ఇళ్లు పంపిణీ చేయాలని కోరారు.
ఇవీ చూడండి...