RAILWAY TRACK: నడుస్తున్న గూడ్స్ రైలు నుంచి బోగీలు వేరుపడిన సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల - అప్పికట్ల మధ్య జరిగింది. ఒంగోలు వైపు నుంచి విజయవాడ వెళ్తున్న గూడ్స్ రైలు బోగీల మధ్య ఉన్న కప్లింగ్ ఊడిపోవటంతో 8 బోగీలు బాపట్ల సమీపంలో నిలిచిపోయాయి. మిగిలిన బోగీలు ఇంజన్‌తో సహా అప్పికట్ల వరకు వెళ్లాయి. ఇదీ గమనించిన రైల్వే సిబ్బంది రైలును నిలిపివేశారు. దీంతో విజయవాడ వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. చీరాలలో విక్రమసింహపురి, ఉప్పుగుండూరులో కేరళ ఎక్స్ ప్రెస్ రైళ్ళు కొద్దిసేపు నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.
ఇదీ చదవండి: