గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో 10 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో... విశ్వవిద్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. విజయం సాధించిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు మూడంచెల భధ్రతను విధించారు. కౌంటింగ్ వద్ద కేంద్ర బలగాలు, బయట జిల్లా, రాష్ట్ర పోలీసులు పహారా కాస్తున్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది, మీడియాను తప్ప మరెవరిని లోపలికి అనుమతించరు. గురువారం రాత్రి 9 గంటలకల్లా తుది ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ చెప్పారు.
ఇవి చదవండి...'నర్సాపురం'తో మొదలై... 'నందిగామ'తో ముగింపు