గుంటూరు నగరంలో మాస్క్ విషయమై చెలరేగిన గొడవ.. కార్పొరేటర్, ఓ యువకుడు పరస్పరం కొట్టుకునే వరకూ వెళ్లింది. బ్రాడిపేట సాయిచరణ్ బాయ్స్ హాస్టల్ వద్ద యువకులు గుమికూడి ఉండటాన్ని గమనించిన 32వ డివిజన్ కార్పొరేటర్ ఆచారి.. మాస్కు పెట్టుకోని ఓ యువకుడిని గట్టిగా మందలించారు. మాటామాట పెరిగి సదరు యువకుడిపై కార్పొరేటర్ ఆచారి చేయి చేసుకున్నారు. తల్లిదండ్రులే నన్ను కొట్టరు, మీరు కొడతారా అంటూ ఆగ్రహించిన యువకుడు.. కార్పొరేటర్‌పై తిరగబడ్డాడు. స్నేహితుడితో కలిసి కార్పొరేటర్‌ని తిరిగి కొట్టాడు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ ఆచారి అనుచరులు అక్కడికి చేరుకుని.. హాస్టల్ గదిలోని యువకులను బయటకు తీసుకువచ్చి దాడి చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పట్టాభిపురం పోలీసులు.. ఇద్దరు యువకుల్ని స్టేషన్‌కు తరలించారు.
గుంటూరులో కార్పొరేటర్‌ని కొట్టిన యువకుడు.. చితకబాదిన అనుచరులు - corporator attack an hostler news
కరోనా వ్యాప్తి చెందుతున్నా.. యువకులు పట్టించుకోకుండా గూమికూడి ఉన్నారు. ఇది గమనించిన కార్పొరేటర్ అక్కడకు వెళ్లి.. మాస్కు లేని యువకుడిని మందలించారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.. యువకుడిపై కార్పొరేటర్ చేయి చేసుకున్నాడు. మా తల్లిదండ్రులే కొట్టరు.. నువ్వు నన్ను కొడతావా అని కార్పొరేటర్‌ని తిరిగి దాడి చేశాడు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ అనుచరులు.. అక్కడకు చేరుకుని యువకుడిని చితకబాదారు.