ETV Bharat / state

కరోనా విజృంభిస్తున్నా.. నిర్లక్ష్యం విడట్లేదు - గుంటూరులో కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో కోవిడ్ కేసులు ఏమాత్రం తగ్గటం లేదు. జిల్లాలో పాజిటివ్ కేసులు 26వేలు దాటిపోయాయి. కరోనా కట్టడికి అధికారులు తీసుకునే చర్యలు ఏ మాత్రం సరిపోవటం లేదు. దుకాణాలు తెరిచే సమయం కొద్ది గంటలే ఉండటంతో అపుడు రద్దీ పెరగటం, మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం లేకపోవటం కేసుల విస్తృతికి కారణంగా కనిపిస్తోంది. కరోనా మరణాలు కూడా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం.

corona in gunur
కరోనా విజృంభిస్తున్నా.. నిర్లక్ష్యం విడట్లేదు
author img

By

Published : Aug 14, 2020, 10:35 PM IST

గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 527 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 26వేల 559కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 132 ఉన్నాయి. ఆ తర్వాత నర్సరావుపేటలో 90, కారంపూడి 53, తెనాలి 39, యడ్లపాడు 23, సత్తెనపల్లి 17, ప్రత్తిపాడు 13, మాచర్ల 11, బాపట్ల 11, చిలకలూరిపేట11, పెదకూరపాడు 10, వినుకొండ 10 కేసులు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 107 కేసులు వచ్చాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కరోనా నుంచి జిల్లాలో 16వేల 882 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.

కరోనా కారణంగా శుక్రవారం నాడు 10మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ జిల్లాలో మరణించిన వారి సంఖ్య 275కు చేరుకుంది. కరోనా మరణాలు రోజురోజుకీ పెరుగుతుండటం అధికారుల్ని కలవరపరుస్తోంది. ఇందులో 10మంది మాత్రమే ఇళ్లలో మరణించారు. మిగతావారు ఆసుపత్రుల్లోనే చనిపోయారు. ఆసుపత్రుల్లో వైద్యం మెరుగుపర్చే క్రమంలో ప్లాస్మా చికిత్స ప్రారంభించారు.

జిల్లావ్యాప్తంగా దుకాణాలు ఉదయం 11గంటల వరకే అనుమతిస్తున్నారు. అయినా కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు ఉదయం 8నుంచి 11గంటల మధ్యలో ఎక్కువగా బయటకు వస్తున్నారు. ఆ సమయంలో రద్దీ నెలకొంటుంది. ఇదే వైరస్ వ్యాప్తికి కారణంగా కనిపిస్తోంది. మద్యం దుకాణాలు మాత్రం రాత్రి 9గంటల వరకూ తెరిచే ఉంటున్నారు. అక్కడ కనీస భౌతిక దూరం కనిపించటం లేదు. ఇది కూడా పాజిటివ్ కేసులు పెరగటానికి దోహదం చేస్తోంది.

జిల్లాలో ప్రస్తుతం ప్రతి 10లక్షల మందిలో 54వేల మందికి కరోనా పరీక్షలు చేశారు. గతంతో పోలిస్తే పరీక్షల సంఖ్య తగ్గించారు. ఇక కరోనా పరీక్షలు చేయించుకున్నవారు కొందరు ఇళ్లలో ఉండకుండా బయట తిరుగుతున్నారు. పాజిటివ్ అని తేలేలోగా వారి ద్వారా మరికొందరికి వైరస్ వ్యాప్తిస్తోంది. కరోనా సామాజిక వ్యాప్తి జరుగుతుండటం, మరణాలు కూడా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశాలు.

ఇదీ చదవండి: మూడు రాజధానుల అంశంపై స్టేటస్ కో కొనసాగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.