ETV Bharat / state

కరోనా పరీక్షా ఫలితాలు ఆలస్యం..

గుంటూరు జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్ష సమస్యగా మారింది. పరీక్ష చేయించుకోవడం ఓ ఇబ్బందయితే దాని ఫలితం కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ కారణంగా చాలామందికి ఫలితాలు వెలువడే లోపు బయట తిరుగుతుండటంతో మరికొందరికి సోకుతోంది.

corona results
కరోనా పరీక్షలు
author img

By

Published : Apr 27, 2021, 1:39 PM IST

కొరిటపాడుకు చెందిన ఓ వ్యక్తికి ఈ నెల 18వ తేదీ రాత్రి జ్వరం వచ్చింది. కరోనా అనుమానంతో అతను భార్యతో కలిసి బృందావన్‌గార్డెన్స్‌లో పరీక్షా కేంద్రానికి వెళ్లి శాంపిల్‌ ఇచ్చి వచ్చారు. రెండు, మూడు రోజులు గడిచినా ఫలితం లేదు. బాధ్యతగల వ్యక్తిగా అతను ఇంట్లోనే ఉండిపోయాడు. ఐదు రోజులు వేచి చూసిన తర్వాత ప్రైవేటుగా యాంటీజెన్‌ పరీక్ష చేయించగా ఇద్దరికీ పాజిటివ్‌ అని తేలింది. అయితే ప్రభుత్వ వైద్య సిబ్బంది సేకరించిన నమూనా ఫలితం మాత్రం రాలేదు. తీవ్రమైన లక్షణాలు ఏమీ లేకపోవడంతో వైద్యులను సంప్రదించి హోం ఐసొలేషన్‌లో ఉండి వారు సూచించిన మందులు వాడుతున్నారు. చివరకు వారి నమూనా ఈ నెల 24న ల్యాబ్‌కు చేరినట్లు సందేశం వచ్చింది. 26వ తేదీ తెల్లవారుజామున ఆయనకు పాజిటివ్‌ వచ్చినట్లు చరవాణికి సమాచారం పంపించారు. అంటే పరీక్షకు, ఫలితానికి 8 రోజుల సమయం పట్టింది. ఒకవేళ ఆయన యాంటిజెన్‌ పరీక్ష చేయించుకోకుండా బయట తిరిగి ఉంటే చాలా మందికి వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉండేది.

శ్రీనివాసరావుపేటకు చెందిన ఒకరికి వారం రోజుల క్రితం జలుబు, జ్వరం వచ్చింది. కొవిడ్‌ సోకిందనే అనుమానం వచ్చి పరీక్ష కోసం పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. టీకా వేస్తున్నాం కాబట్టి పరీక్షలు చేయట్లేదన్నారు. జీజీహెచ్‌కు వెళ్తే అక్కడ పెద్ద వరుస ఉంది. బృందావన్‌గార్డెన్స్‌కు వెళ్లినా అక్కడా అదే పరిస్థితి. దీంతో ఓ ప్రైవేటు ల్యాబ్‌లో రూ.2వేలు చెల్లించి పరీక్ష చేయించారు. దంపతులిద్దరికీ పాజిటివ్‌గా తేలింది. వెంటనే వైద్యుడిని సంప్రదించి మందులు తీసుకోవడం ప్రారంభించారు. వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించే పరీక్షల కోసం వేచిచూసి ఉంటే ఇబ్బందులు తలెత్తేవి.

గుంటూరు జిల్లాలో కరోనా నిర్ధారణ పెద్ద పరీక్షగా మారింది. పరీక్ష చేయించుకోవడం ఓ ఇబ్బందయితే దాని ఫలితం కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో పరీక్షలు చేయించుకున్న వారు ఫలితం రాకుండానే బయట తిరుగుతున్నారు. కరోనా వచ్చినా ఆ విషయం తెలియక వారు బయటకు రావడంతో వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. వైరస్‌ విజృంభణకు అడ్డుకట్ట వేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. టెస్టుల ఫలితం అలస్యం కావడమే దీనికి ముఖ్య కారణం. కరోనా మొదటి విడతలో పరీక్ష చేసిన 24 గంటల్లోపే ఫలితం వచ్చేది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ల్యాబ్‌ సామర్థ్యం పెరిగినా నమూనాల సేకరణ ఎక్కువ కావడంతో రోజూ వేలాది పరీక్షలు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 7వేల నుంచి 9వేల వరకూ పరీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్టీపీసీఆర్‌ విధానంలో మాత్రమే పరీక్షలు చేయాలని ఆదేశించింది. గతంలో ర్యాపిడ్‌ కిట్లు, యాంటిజెన్‌ కిట్ల ద్వారా కూడా పరీక్షలు నిర్వహించేవారు. వీటి ఫలితం వేగంగా వచ్చేది. అయితే వాటిలో కచ్చితత్వం తక్కువనే ఉద్దేశంతో ప్రభుత్వం వద్దని సూచించింది. దీంతో అందరికీ ముక్కు ద్వారా నమూనా సేకరించి ల్యాబ్‌కు పంపి పరీక్ష చేసి ఫలితం ఇవ్వడం బాగా ఆలస్యమవుతోంది. గత వారం రోజుల నుంచి టెస్టుల సంఖ్య భారీగా పెంచారు. అయితే గతంలో సేకరించిన నమూనాలు పేరుకుపోవడంతో వాటిని పరీక్షించి ఫలితాలు ఇస్తున్నారు. ఈలోపే మళ్లీ వేలాదిగా నమూనాలు వచ్చిపడుతున్నాయి. మొదట్లో కిట్ల కొరత ఎదురైంది. కిట్లు సమకూర్చుకున్న తర్వాత సిబ్బంది సమస్య వచ్చింది. అత్యవసరంగా సిబ్బందిని నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతించడంతో ఆ ప్రక్రియ పూర్తి చేశారు. ఇపుడిపుడే పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన గాడిలో పడుతోందని అధికారులు చెబుతున్నారు.

టీ అగ్రహారానికి చెందిన ఓ వ్యక్తి కరోనా అనుమానంతో ప్రైవేటులో యాంటీజన్‌ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ఇంట్లోవారికి వచ్చి ఉంటుందనే అనుమానంతో భార్యకు ఈనెల 17న ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించారు. ఆ తర్వాత రోజు నుంచే ఆమెకు జ్వరం, ఒళ్లునొప్పులు మొదలయ్యాయి. రుచి, వాసన కోల్పోయారు. దీంతో వైద్యుడిని సంప్రదించి మందులు వాడకం మొదలుపెట్టారు. ఈనెల 20న ఫలితం నెగెటివ్‌ అని వచ్చింది. లక్షణాలు మాత్రం కొవిడ్‌కు సంబంధించినవే. నెగెటివ్‌ వచ్చినప్పటికీ మందులు తీసుకోవటం కొనసాగించారు. ఇపుడిప్పుడే కోలుకుంటున్నారు. ఒకవేళ ఫలితాన్ని నమ్మి మందులు వాడడం మానేస్తే సమస్యలు వచ్చేవి. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ఫలితం కూడా కచ్చితంగా రావడం లేదు. నెగెటివ్‌ వచ్చిన వారిలో చాలా మందిలో కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఫలితం ఆధారంగా వారు వైద్యం తీసుకోకుండా మానేస్తే ప్రమాదం. అందుకే వరుసగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాసన, రుచి కోల్పోవడం, పొడిదగ్గు ఉన్నవారు పరీక్ష ఫలితంతో సంబంధం లేకుండా వైద్యున్ని సంప్రదించి మందులు తీసుకోవటం మేలు.

ఇదీ చదవండీ..జగన్ బెయిల్ రద్దుపై రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్​ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.