ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ బాబా లాల్ అన్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చేవారే ఆరోగ్యంగా ఉంటారన్నారు. అప్పుడు అందరికి మాస్కులు అవసరం లేదన్నారు. జలుబు, దగ్గు బారిన పడ్డవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇది ఒకరి నుంచి మరోకరికి సులువుగా సంక్రమించే వ్యాధి అని తెలిపారు. దగ్గు,జలుబు, తుమ్ములు వంటి లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అందరూ అనవసరంగా మాస్కులు పెట్టుకోవద్దన్నారు. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు నమస్తే అంటూ చేతులు జోడించటం మేలని.. కరచాలనం చేయకపోవడమే మంచిదన్నారు.
ఇవీ చదవండి