ETV Bharat / state

గుంటూరు జిల్లాలో నేడు 13 కేసులు.. మొత్తం 351!

author img

By

Published : May 5, 2020, 1:20 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నేడు మరో 13 కేసులు నమోదయ్యాయి. మొత్తం జిల్లాలో కేసుల సంఖ్య 351కు చేరుకుంది. 128 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా, 8 మంది మృతిచెందారు.

corona positive cases in guntur district
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో ఇవాళ మరో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 351కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో 11 నరసరావుపేటలోనే ఉన్నాయి. పేటలో మొత్తం కేసుల సంఖ్య 153కు చేరింది. మండల పరిధిలోని రెడ్డిపాలెంలో ఒకరికి, గుంటూరు నగరంలో మరొకరికి కరోనా సోకినట్టు తెలుస్తోంది.

తాజా లెక్కల ప్రకారం గుంటూరు నగరంలోనూ కేసుల సంఖ్య 153కి చేరింది. మిగతా కేసులు మాచర్ల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మంగళగిరి, తాడేపల్లి, అచ్చంపేట, క్రోసూరు, కారంపూడి, చిలకలూరిపేట, కర్లపాలెం ప్రాంతాల్లో నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 128మంది ఇళ్లకు వెళ్లగా 8మంది మరణించారు. గుంటూరులోని ఐడీ ఆసుపత్రి, ఎన్.ఆర్.ఐ ఆసుపత్రుల్లో 215మంది చికిత్స పొందుతున్నారు.

గుంటూరు, నర్సరావుపేటలను హాట్ స్పాట్లుగా అధికారులు గుర్తించారు. కొత్తగా వచ్చిన కేసుల్లో కొన్ని రెడ్ జోన్లలో కాకుండా వేరే ప్రాంతాల్లో రావటం ఆందోళన కలిగిస్తోంది. కొత్త కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి అక్కడ పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు. గుంటూరు, నరసరావుపేటల్లో లాక్ డౌన్ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

అయితే నిన్న మద్యం దుకాణాలు తెరవటంతో రెడ్ జోన్ల నుంచి పెద్దఎత్తున గ్రీన్ జోన్లకు మందుబాబులు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. మండలం నుంచి మరో మండలానికి వెళ్లేందుకు ఆంక్షలు ఉన్నా... అంత మంది ఎలా వెళ్లారని పోలీసులు ఆరా తీస్తున్నారు. నేడు ఆంక్షలు కఠినతరం చేశారు. పాసులు ఉన్న వాహనాలను కూడా తనిఖీ చేసి పంపిస్తున్నారు.

ఇవీ చదవండి:

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.