గుంటూరులో కరోనా కేసులు ఉద్ధృతమయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 18 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 195కి చేరింది. నరసరావుపేటలో ఓ కేసు మినహా మిగతా అన్ని కేసులు గుంటూరు అర్బన్ నుంచే నమోదు కావడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. ఇంతవరకు జిల్లాలో కరోనాతో 8 మంది మృతి చెందగా... 23 మంది డిశ్చార్జయ్యారు. మరో 164 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 4 రోజుల్లో 66 పాజిటివ్ కేసులు నమోదు కావడంపై అధికార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ముస్లిం మతపెద్దలతో అధికారుల సమావేశం
రంజాన్ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముస్లిం మతపెద్దలతో కొవిడ్ జిల్లా ప్రత్యేకాధికారి రాజశేఖర్, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, ఐజీ ప్రభాకరరావు, ఎస్పీలు సమావేశమయ్యారు. ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు ఇమామ్, మౌజన్తో పాటు మరో ఇద్దరిని అనుమతిస్తామని కలెక్టర్ చెప్పారు. కంటైన్మెంట్, రెడ్ జోన్ ప్రాంతాల్లో డ్రై ఫూట్లను ఇంటికే అందిస్తామని .
ఇదీ చూడండి..