ETV Bharat / state

టెలీ మెడిసిన్ సేవలు.. డయల్ చేయండి 14410, 89858 77699

కరోనా ప్రభావంతో సాధారణ వైద్యసేవలు అందని పరిస్థితి నెలకొంది. కేవలం అత్యవసర వైద్యసేవలు మినహా ఎలాంటి సాధారణ వ్యాధులకు వైద్య సేవలు అందడం లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం టెలీ మెడిసిన్‌ ద్వారా సేవల్ని చేరువ చేస్తోంది. ఓ ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు.. వెంటనే మీకు వైద్యసేవలు అందుతాయి. దీనిపై ప్రత్యేక కథనం మీకోసం..

tele medicine services in andhra pradesh state
ఏపీలో టెలీ మెడిసిన్ సేవలు
author img

By

Published : Apr 23, 2020, 6:32 PM IST

నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన రమణయ్య అనే వ్యక్తి ఈనెల 7న బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యారు. దాంతో బంధువులు ఆయన్ను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అత్యవసర వైద్యానికి చేర్చారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సమన్వయకర్తకు ఫోన్‌ చేసి విషయాన్ని తెలపటంతో ఆయన అక్కడకు చేరుకొని వారి పరిస్థితి తెలుసుకున్నారు. అప్పటికే బాధితుల నుంచి ఆసుపత్రి సిబ్బంది కొంత మొత్తాన్ని వసూలు చేశారు. ఈ విషయాన్ని సమన్వయకర్తకు బాధితులు తెలపగా.. వారికి ఆ డబ్బులను చెక్కు రూపంలో ఇప్పించారు. ఉచితంగా ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకున్నారు.

టోల్ ఫ్రీ నెంబర్

కరోనా నేపథ్యంలో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా.. బయటకు వెళ్లలేని పరిస్థితి. ఒక వేళ పెద్ద పెద్ద ఆస్పత్రులకు వెళ్లినా అక్కడ కేవలం అత్యవసర వైద్యసేవలు మాత్రమే అందిస్తున్నారు. సాధారణ రోగులను తిరిగి పంపించేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టెలీ మెడిసిన్‌ పేరుతో టోల్‌ ఫ్రీ నంబర్‌ను 14410ను కేటాయించారు. ప్రజలు ఈ నంబర్‌కు కాల్‌ చేస్తే వైద్యుడి ద్వారా సలహాలు, సూచనలు అందుతాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌ వైద్యసేవలు కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.

ఫోన్​లో సలహాలు, సూచనలు

రాష్ట్రంలో ఈనెల 13న టెలీ మెడిసిన్‌ను ప్రారంభించారు. అయితే నెల్లూరు జిల్లాలో ఈనెల 15వ తేదీన ఇందుకు అవసరమైన వైద్యుల రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించి సేవలు కొనసాగిస్తున్నారు. రోజుకు 150 ఫోన్‌ కాల్స్‌ వస్తుండగా.. వారందరికీ మందులు, తదితర వైద్య సూచనలు అందిస్తున్నారు. ఒకవేళ ప్రమాదకర పరిస్థితులు ఉంటే ఆసుపత్రికి వెళ్లాలని సిఫార్సు చేస్తున్నారు. కొవిడ్‌-19 లక్షణాలు అని అనుమానిస్తే సంబంధిత వ్యక్తుల వైద్యులను వారి వద్దకు పంపి ఆరోగ్య లక్షణాల మేరకు అవసరమైతే క్వారంటైన్‌ కేంద్రాలను తరలిస్తున్నారు.

ఇలా చేయాలి..

* 14410 అనే నంబరుకు ప్రజలు కాల్‌ చేసిన వెంటనే 2 సార్లు రింగ్‌ అయి కట్‌ అవుతుంది.

* ఆ తర్వాత కాల్‌ సెంటర్లోని ఎగ్జిక్యూటివ్‌.. రోగి నంబరుకు ఫోన్‌ చేసి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.

* అనంతరం వైద్యుడికి ఫోన్‌ కనెక్టు చేస్తారు. వైద్యుడు రోగి సమస్యలు విని మందులు అవసరమనుకుంటే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌కు సూచిస్తారు.

* 243 రకాల్లోని మందులను రోగుల అవసరం మేరకు వాలంటీరు చేరవేస్తారు. ఇప్పటికే కొంతమంది వైద్యులు దీనిలో స్వచ్ఛందంగా రిజిస్టర్‌ చేసుకున్నారు.

200 మందికి అత్యవసర వైద్యం

అత్యవసర వైద్యానికి డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ నాగార్జున ఫోన్‌ నంబర్‌ 89858 77699కు కాల్‌ చేయవచ్చు. ఆరోగ్యశ్రీ అమలవుతున్న వైద్యశాలల్లో చేరేందుకు ఏమైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు ఈ నంబరుకు ఫోన్‌ చేస్తే ఆయన స్పందిస్తారు. సంబంధిత ఆస్పత్రుల నిర్వాహకులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారు. జిల్లాలో అత్యవసర వైద్యసేవలను ఈనెల 11వ తేదీ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు 200కు పైగా ఫోన్‌ కాల్స్‌ రాగా.. అన్నింటికి స్పందించి సత్వర సహాయాన్ని అందించారు.

ఇవీ చదవండి.. వైకాపా ఎంపీ విజయసాయిపై నాగబాబు సెటైర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.