ETV Bharat / state

ఫిరంగిపురం పాఠశాలల్లో పెరుగుతున్న కేసులు - గుంటూరు జిల్లా పాఠశాలల్లో కరోనా కేసులు తాజా వార్తలు

కరోనా లాక్​డౌన్​ అనంతరం స్కూల్ తెరుచుకోవడం, పాఠశాలల్లో నమోదయ్యే కేసులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం.. తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తోంది. గుంటూరు జిల్లాలో ఇప్పటికే కేసులు అధికంగా నమోదు కావడం.. అధికారులు విద్యార్ధులు, ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పలు పాఠశాలల్లో పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి.

corona cases recorded in schools
పాఠశాల్లో పెరుగుతున్న కరోనా కేసులు
author img

By

Published : Nov 12, 2020, 10:40 AM IST

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో 529 మంది పిల్లలకు అధికారులు కొవిడ్ -19 పరీక్షలు చేశారు. దీంతో ప్రైవేటు పాఠశాలలో ఇద్దరు పిల్లలకు పాజిటివ్ వచ్చింది. 79 మంది ఉపాధ్యాయులకు పరీక్ష చేయగా నుదురుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడికి కొవిడ్​ ఉన్నట్లు నిర్ధారించారు. మేడికొండూరు మండలం కొర్రపాడు, సిరిపురం పాఠశాలల్లో ఒకటి చొప్పున, మందపాడు పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. పేరేచర్ల పాఠశాలలో ఉపాధ్యాయుడుకు కరోనా పాజిటివ్​గా వైద్యులు తేల్చారు. కాగా తుళ్ళూరు మండలంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ముగ్గురికి కరోనా సోకినట్లు వేద్యాధికారులు కొన్ని రోజుల క్రితమే వెల్లడించారు.

ఇవీ చూడండి...

గుంటూరు జీజీహెచ్​ను సందర్శించిన మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.