ETV Bharat / state

గుంటూరులో మరో ఐదుగురికి కరోనా: 214కు చేరిన పాజిటివ్​ కేసులు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. గుంటూరు జిల్లాలో పాజిటివ్​ కేసుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకూ 214 మందికి పాజిటివ్​గా నిర్థారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. వ్యాప్తిచెందకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు.

గుంటూరులో మరో ఐదుగురికి కరోనా.. 214కి చేరిన పాజిటివ్​ కేసులు

author img

By

Published : Apr 26, 2020, 3:54 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ మరో ఐదు పాజిటివ్​ రాగా... మొత్తం కేసుల సంఖ్య 214కు చేరింది. కొత్తగా వచ్చిన పాజిటివ్​ కేసుల్లో ఇద్దరు... కృష్ణా జిల్లా నూజివీడు క్వారంటైన్​ కేంద్రంలో ఉన్నారు. మరొకరు శ్రీనివాసరావుపేటకు చెందినవారు కాగా.. ఇంకో ఇద్దరు నరసరావుపేటకు చెందినవారు ఉన్నారు.

కేసుల సంఖ్య పెరిగిందిలా..!

తేదీ కేసులు
మార్చి 25తొలి కేసు
ఏప్రిల్​ 1050
ఏప్రిల్​ 14100
ఏప్రిల్​ 21150
ఏప్రిల్​ 24200

ఆరోగ్య శాఖ తాజా బులిటెన్​లో ఇప్పటి వరకూ 214 మంది కరోనా బారినపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసుల్లో 125 మంది గుంటూరు నగరంలోనే ఉన్నారు. 48 మంది నరసరావుపేట, మరో 38 మంది ఇతర ప్రాంతాలకు చెందినవారు.

ఇదీ చూడండి..

క్వారంటైన్​ కేంద్రంగా పీఎంఏవై గృహ సముదాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.