గుంటూరు జిల్లాలో నేడు మరో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కేసుల సంఖ్య 568కు చేరాయి. కొత్తగా వచ్చిన వాటిలో వెలగపూడి సచివాలయంలో 2, సత్తెనపల్లి 2, గుంటూరు, పత్తిపాడు, నవులూరు, అవిశాకపాలెంలో ఒక్కో కేసు చొప్పున ఉన్నట్లు అధికారులు తెలిపారు. పాజిటివ్ కేసుల వివరాలు అధికారికంగా వెల్లడించటంలో ఆలస్యం జరుగుతోంది.
సచివాలయ ఉద్యోగులకు 4వతేదీన పాజిటివ్ రాగా.. వాటిని ఈరోజు ప్రకటించారు. సత్తెనపల్లిలో వచ్చిన రెండు కేసులు ఇటీవల మరణించిన వ్యక్తి కుటుంబసభ్యులుగా అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో మరణించిన వస్త్ర వ్యాపారికి సత్తెనపల్లిలో.. అంత్యక్రియలు నిర్వహించారు.
ముందు జాగ్రత్తగా అధికారులు నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. అంత్యక్రియల తర్వాత నివేదిక రాగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా తమ్మునికి, కుమార్తెకి కరోనా వచ్చినట్లు తేలింది. అలాగే మృతదేహాన్ని తీసుకువచ్చిన అంబులెన్స్ డ్రైవర్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. అతను హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కావడంతో అక్కడి అధికారులకు సమాచారం అందించారు.
ఇదీచూడండి. 'తక్షణమే ఆ రంగులు తొలగించండి'