గుంటూరు జిల్లాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా జిల్లాలో 305 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండో దశ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇంత తక్కువగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. తాజాగా గుంటూరు నగరపరిధిలో 39 కేసులు నమోదు కాగా.. చిలకలూరిపేట, గురజాలలో 14 కేసులు చొప్పున, పొన్నూరులో 13, సత్తెనపల్లి, పిడుగురాళ్లలో 11 కేసులు , నాదెండ్ల, నరసరావుపేట, నూజెండ్ల, రొంపిచర్ల మండలాల్లో 10 కేసులు చొప్పున నమోదయ్యాయి.
ప్రస్తుతం జిల్లాలో క్రియాశీల కేసులు 3,678గా ఉన్నాయి. మరోవైపు మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇవాళ కరోనాతో ఆరుగురు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1055కి చేరింది. మరోవైపు జిల్లాలో వైద్యాధికారులు.. మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు.
ఇదీ చదవండి: RTC: గుంటూరు జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు 103 ఆర్టీసీ సర్వీసులు