గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా జిల్లాలో 385 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 66 వేల 885కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరం నుంచే 69 కేసులు బయటపడ్డాయి. మంగళగిరిలో 34, పెదకాకానిలో 22 కేసులు, నరసరావుపేటలో 21, తాడేపల్లిలో 16, దాచేపల్లి, రేపల్లె, సత్తెనపల్లిలో 14 చొప్పున, చిలకలూరిపేటలో 13 కేసులు, కర్లపాలెంలో 12, బాపట్లలో 11 కేసులు చొప్పున నమోదయ్యాయి.
గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 61వేల 533 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ ప్రభావంతో ఇవాళ జిల్లాలో ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 610కి చేరింది. రాష్ట్రంలో కరోనా కారణంగా అధిక మరణాలు సంభంవిస్తోన్న జిల్లాల్లో గుంటూరు రెండోస్థానంలో కొనసాగుతోంది.
ఇదీ చదవండి: