ETV Bharat / state

గుంటూరులో దడ పుట్టిస్తున్న కరోనా...ఆందోళనలో ప్రజలు - గుంటూరు జిల్లాలో కరోనా కేసుల

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు దడ పుట్టిస్తున్నాయి. రెండు వారాలుగా కరోనా కేసులు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఒక్క ఆదివారం రోజే 387 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 4వేల213కి పెరిగింది. మరోవైపు కరోనా నియంత్రణ చర్యలపై జిల్లా యంత్రాంగం సమీక్ష చేపట్టి.. తక్షణం అనుసరించాల్సిన కార్యాచరణపై ఆదేశాలు జారీచేసింది.

corona cases
corona cases
author img

By

Published : Jul 14, 2020, 12:17 AM IST

గుంటూరు జిల్లాలో పల్లె, పట్టణం తేడా లేకుండా కరోనా కోరలు చాస్తోంది. దాదాపుగా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు వైరస్ విస్తరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 243 కేసులు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే ఉన్నాయి. ప్రధానంగా గుంటూరులోని నల్లచెరువు, ఏటీ అగ్రహారం, ఏటుకూరు, ఐపీడీ కాలనీ, బ్రాడీపేట ప్రాంతాలు కరోనాతో వణుకుతున్నాయి.

జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ కేసుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. తాడేపల్లి మండలంలో 16, తెనాలి 23, నరసరావుపేట 25, మంగళగిరి 16 చొప్పున నమోదయ్యాయి. సత్తెనపల్లి, బొల్లాపల్లిలో 6 చొప్పున కేసులు, చిలకలూరిపేట 5, అమరావతిలో ఐదేసి కేసులు, పెద్దనందిపాడు 4, గురజాల, రేపల్లె, పిడుగురాళ్లలో మూడు కేసులు చొప్పున నమోదయ్యాయి. పెద్దకాకాని, శావల్యాపురం, తాటికొండ, మాచర్ల, చుండూరు, క్రోసూరులో రెండేసి కేసులు.. అచ్చంపేట, బాపట్ల , దాచేపల్లి, దుగ్గిరాల, దుర్గి, యడ్లపాడు, గుంటూరు రూరల్, ఈపూరు, నూజెండ్ల, పెదకూరపాడు, పొన్నూరు, రొంపిచర్ల, తుళ్లూరు, చుండూరు, వట్టిచెరుకూరు, వేమూరులో ఒకటి చొప్పున కేసులు బయటపడ్డాయి. ఒకేరోజు ఇంతపెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వర్తక, వాణిజ్యసంస్థలు, దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యకాలంలోనే నిర్వహిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో నానాటికి పెరుగుతున్న కేసుల క్రమంలో మంగళగిరిలో జిల్లాయంత్రాంగం సమీక్ష సమావేశం నిర్వహించింది. కరోనా కేసులను కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన చర్యలపై చర్చించారు. కోవిడ్ నియంత్రణ జిల్లా ప్రత్యేక అధికారి రాజశేఖర్, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కరోనా కేసుల కట్టడిపై పురపాలక అధికారులకు దిశానిర్దేశం చేశారు.

కంటైన్మెంట్ జోన్లలో అందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధానంగా మరణాల సంఖ్య తగ్గించే లక్ష్యంతో 60 ఏళ్ల పైబడిన వాళ్లందరికీ, గర్భిణీలు, చిన్నారులకు తప్పనిసరిగా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఎంతమందికైనా పరీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని... అవసరమైతే ప్రత్యేక సిబ్బందిని నియమిస్తామని జిల్లాయంత్రాంగం వెల్లడించింది.

త్వరలో జిల్లాకు 20వేల యాంటీజెన్ కిట్లు వస్తున్నాయని.. వీటిద్వారా పరీక్షలను వేగవంతం చేయనున్నామని ప్రత్యేకాధికారి రాజశేఖర్, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ చెప్పారు. కరోనా కేసుల పెరుగుదల తీవ్రత క్రమంలో రాబోయే వారం రోజులపాటు అనవసరంగా రోడ్లపై వచ్చేవారిపై చర్యలు తీసుకోవాలని, నిబంధనలు కఠినంగా అమలుచేయాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది.

ఇదీ చదవండి: 10,100 పడకలతో దేశంలోనే అతిపెద్ద కరోనా కేర్​ సెంటర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.