గుంటూరు జిల్లాలో కొవిడ్ వైరస్ విజృంభిస్తోంది. ఆదివారం ఒక్కరోజే 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 858కు చేరింది. గడిచిన 2 రోజుల్లో 70 కేసులు నమోదుకావడం వైరస్ వ్యాప్తి తీవ్రతను తెలియజేస్తోంది. ఆదివారం వైరస్ బారిన పడిన వారిలో 26 మంది జిల్లా వాసులు కాగా... వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చి క్వారంటైన్ సెంటర్లలో ఉన్న 14 మంది పాజిటివ్‌గా తేలారు.
తాజా కేసుల్లో తాడేపల్లిలో అత్యధికంగా 15 కేసులు నమోదయ్యాయి. గుంటూరు నల్లచెరువులో 5, పట్టాభిపురం, బాలాజీనగర్‌లో ఒక్కొక్క కేసు, క్వారంటైన్ కేంద్రాల్లో ముగ్గురికి సోకింది. నరసరావుపేటలో మరో ఆరుగురికి, మంగళగిరి మండలంలో 4 పాజిటివ్ కేసులు గుర్తించారు. కంతేరు, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, అల్లూరు, తుళ్లూరులో ఒక్కొక్క కేసు బయటపడ్డాయి. ఇప్పటి వరకు 502 మందికి పైగా కొవిడ్ బాధితులు కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
ఇవీ చదవండి...: 'నిబంధనల ప్రకారమే డ్రైవింగ్ నేర్చుకోవాలి'