గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గింది. శుక్రవారం 1463 కేసులు నమోదు కాగా.. శనివారం 1040 కేసులు నమోదయ్యాయి. తాజాగా 1249 కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అత్యధికంగా.. 363 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
మంగళగిరిలో 68 , తాడేపల్లిలో 57, నరసరావుపేటలో 51 , చిలకలూరిపేటలో 46, పిడుగురాళ్లలో 40, తెనాలిలో 33 కేసులు, చేబ్రోలులో 31 కేసులు, నకరికల్లు, బాపట్లలో 24 చొప్పున, నాదెండ్లలో 22 కేసులు నమోదయినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ ఒక్కరోజే 8మంది మృతిచెందగా.. జిల్లాలో కరోనాతో మొత్తం మృతుల సంఖ్య 898కు చేరింది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో 15వేల 712 క్రియాశీల కేసులున్నాయి..
ఇదీ చదవండి: