ETV Bharat / state

కరోనా దెబ్బకు...చేనేత విలవిల - corona effect over handloom

కరోనా మహమ్మారి దెబ్బకు చేనేత పరిశ్రమ విలవిల్లాడుతోంది. భారీగా వస్త్ర నిల్వలు పేరుకుపోగా...అనేక మంది ఉపాధిని కోల్పోయారు. లాక్​డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావటం, వస్త్రాలకు డిమాండ్ తగ్గటంతో పరిశ్రమ మరింత సంక్షోభంలోకి వెళుతోంది.

కరోనా దెబ్బకు...చేనేత విలవిల
కరోనా దెబ్బకు...చేనేత విలవిల
author img

By

Published : Apr 13, 2020, 3:26 PM IST

వేసవి వస్తే చేనేత వస్త్రాలకు కాస్తో కూస్తో డిమాండ్ ఉండేది. ఎండ తీవ్రతకు కొంతమంది అయినా చేనేత వస్త్రాలు ధరించేవారు. ఇప్పుడు కరోనా లాక్​డౌన్ కారణంగా జనం ఇళ్లకే పరిమితం కావటం, ఎక్కడ వస్త్రాలు అక్కడే ఉండిపోవటం, మగ్గాలూ మూతపడటం చేనేత పరిశ్రమను ఇబ్బందుల్లోకి నెట్టాయి. కార్మికులు పనుల్లేక విలవిల్లాడుతున్నారు. కొన్ని గ్రామాల్లో దాతలు వారికి విరాళాలు అందజేస్తూ ఆదుకొంటున్నారు. చిలప నూలు ఇప్పట్లో అందే పరిస్థితి కనిపించటం లేదు. చేనేత సహకార సంఘాలు, మాస్టర్​ వీవర్స్ వద్ద వస్త్రాల నిల్వలు పెరిగిపోయాయి.

మగ్గాలు మూలన...
మగ్గాల షెడ్లలో సాధారణంగా పదిమంది కలిసి పని చేస్తుండేవారు. కొవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో వీటిని మూసేశారు. మగ్గాలపై ఉన్న నూలు దెబ్బతింటోంది. లాక్​డౌన్ తొలగించిన తర్వత కూడా మగ్గాలపై ఉన్న నూలుతో వస్త్రాలను తయారు చేయలేని పరిస్థితి ఏర్పడనుంది. కార్మికులు ఉపాధి కోల్పోవటంతో పాటు నూలు నష్టాన్నీ చవిచూడక తప్పని పరిస్థితి.

ప్రభుత్వమే ఆదుకోవాలి..

"ఉపాధి కోల్పోయిన కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి. ఇప్పటికే అనేకమంది అర్థాకలితో జీవనం సాగిస్తున్నారు. అర్హులైన కార్మికులకు నేతన్న భరోసా పూర్తి స్థాయిలో అందలేదు. ప్రభుత్వం కార్మికుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి"

-బాలకృష్ణ, రాష్ట్ర చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి

ఇదీచదవండి

నింగినంటిన 'నిత్యావసరం': కొనేదెలా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.