ETV Bharat / state

Controversies on Postings and Transfers : ముందు అందలం ఎక్కించి...ఆపై అవమానించి...

Controversies on Postings and Transfers : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, పోలీస్ బాస్ గా పనిచేసిన గౌతం సవాంగ్ కు సీఎం జగన్ తొలుత అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల నాటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం ఉండగా.. వైకాపా అధికారంలోకి వచ్చాక ఏరి కోరి మరీ డీజీపీ స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ ను కూర్చోబెట్టారు. ఇక ఆ ఇద్దరు అధికారులూ కూడా ముఖ్యమంత్రి పట్ల ఎంతో అభిమానంతో ఉండేవారు. ఈ ప్రభుత్వం మనదన్న భావనతో పనిచేశారు.

Controversies on Postings and Transfers
ముందు అందలం ఎక్కించి...ఆపై అవమానించి...
author img

By

Published : Feb 16, 2022, 8:14 AM IST

Controversies on Postings and Transfers : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, పోలీస్ బాస్ గా పనిచేసిన గౌతం సవాంగ్ కు సీఎం జగన్ తొలుత అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల నాటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం ఉండగా.. వైకాపా అధికారంలోకి వచ్చాక ఏరి కోరి మరీ డీజీపీ స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ ను కూర్చోబెట్టారు. ఇక ఆ ఇద్దరు అధికారులూ కూడా ముఖ్యమంత్రి పట్ల ఎంతో అభిమానంతో ఉండేవారు. ఈ ప్రభుత్వం మనదన్న భావనతో పనిచేశారు. గౌతమ్‌ సవాంగ్‌ అయితే... తన చర్యలు, తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల పలు విమర్శలకూ గురయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఆయన హయాంలో పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తూ విపక్ష నేతలపై అక్రమంగా కేసులు పెడుతూ, అరెస్టులు చేస్తున్నారన్న ఆరోపణలూ ఎదుర్కొన్నారు. కానీ వేటికీ వెరవకుండా, ప్రభుత్వం చెప్పింది చేయడమే తన విధి అన్నట్టుగా సవాంగ్‌ వ్యవహరించారు. అంత ప్రాధాన్యం ఇచ్చిన ఆ ఇద్దరు అధికారుల్లో... అప్పుడు ఎల్వీని, ఇప్పుడు సవాంగ్‌ని ప్రభుత్వం ఆకస్మికంగా, అనూహ్యంగా పక్కన పెట్టేయడంపై అఖిల భారత సర్వీసు అధికారుల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.

ఇక ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నిన్నటివరకు అంతా తానే అయి చక్రం తిప్పిన ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాష్‌ కూడా ఒక రకంగా ఈ కోవలోకే వస్తారు. ఆయన తన కోరిక మేరకే దిల్లీకి వెళ్తున్నా.. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు, ఆయన చుట్టూ ముసురుకుంటున్న వివాదాల కోణంలో చూస్తే, ఆయనను ఒక్కసారిగా పక్కన పెట్టడమూ చర్చనీయాంశమైంది.

ప్రాధాన్యతలేని పోస్టులోకి ఆయన.. అసలు పోస్టింగే లేకుండా ఈయన!

2019 ఎన్నికలకు ముందు నాటికి సీఎస్‌గా ఉన్న అనిల్‌ చంద్ర పునేఠాను మార్చేసి, ఎల్‌.వి.సుబ్రహ్మణ్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక... ఆయనను మార్చి, సీఎస్‌గా మరొకర్ని నియమిస్తారన్న ఊహాగానాలు కొనసాగినా, జగన్‌ మాత్రం ఆయన వైపే మొగ్గుచూపారు. ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం కూడా సీఎంకు సన్నిహితంగా మెలిగేవారు. సలహాలిచ్చేవారు. ప్రభుత్వ ప్రాధాన్యాలే తన ప్రాధాన్యాలుగా భావించేవారు. ఎక్కడ తేడా వచ్చిందో గానీ... ప్రభుత్వం ఆయనను పదవీ విరమణకు కొన్ని నెలల ముందు అప్రాధాన్య పోస్టులోకి బదిలీ చేసింది. తితిదేలో అన్యమతస్తుల వ్యవహారం కూడా ఆయన బదిలీకి కారణమన్న ప్రచారం జరిగింది. ఆయనను బాపట్లలోని మానవ వనరుల కేంద్రానికి డైరెక్టర్‌ జనరల్‌గా ప్రభుత్వం నియమించింది. అది తన స్థాయికి చాలా చిన్న పోస్టు కావడంతో, అవమానంగా భావించిన ఆయన ఆ విధులు నిర్వర్తించకుండానే, సర్వీసు పూర్తయ్యేవరకూ సెలవులో ఉండి, పదవీవిరమణ చేశారు.

ఇదీ చదవండి : Gautam Sawang Transfer: గౌతమ్ సవాంగ్‌ బదిలీ.. కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్‌రెడ్డి

Sawang Transfer : గత ఎన్నికల సమయానికి విజయవాడ పోలీసు కమిషనర్‌గా ఉన్న గౌతమ్‌ సవాంగ్‌ని, వైకాపా అధికారంలోకి వచ్చాక డీజీపీగా నియమించింది. అప్పటి నుంచి ఆయన ప్రభుత్వం పట్ల తన విధేయతను ప్రకటించేందుకు ఏ అవకాశాన్నీ విడిచి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆయన హయాంలోనే రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న రైతులపై పోలీసుల దౌర్జన్యం, అక్రమంగా కేసులు పెట్టడం, ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం, తెదేపా నాయకులపై కేసులు, అర్ధరాత్రి అరెస్టుల వంటి పలు ఘటనలు జరిగాయి. వాటికి సంబంధించి ఆయనపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. అయినా డీజీపీ కుర్చీలో ఉన్న చివరి క్షణం వరకూ ప్రభుత్వం ఏం చెబితే అదే చేశారన్న అభిప్రాయం ఉంది. అలాంటి ఆయనను అకస్మాత్తుగా బదిలీ చేయడంతో పాటు, పోస్టింగ్‌ కూడా ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలనడం చర్చకు దారి తీసింది.

* వైకాపా అధికారంలోకి వచ్చేనాటికి దిల్లీలో ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఉన్న ప్రవీణ్‌ ప్రకాష్‌... ఆ తర్వాత సీఎం ముఖ్య కార్యదర్శిగా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ)గా రెండు పోస్టుల్లోనూ చక్రం తిప్పారు. సీఎంఓలో అంతా తానే అయి వ్యవహరించారు. అనేక వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. ఆయన నుంచి సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) పోస్టును ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం తప్పించింది. కొన్ని ముఖ్య విభాగాల్ని ఇటీవల వేరే వారికి బదలాయించింది. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆయనను దిల్లీలో ఏపీభవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా పాత పోస్టులోకే పంపడంపైనా చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి : varuna reddy:వరుణారెడ్డిని వెనక్కి పిలిచిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.