ETV Bharat / state

వైసీపీ ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లు చేస్తోంది - రాష్ట్రంలో అధికార దుర్వినియోగం : టీడీపీ

Constitution Day celebrations at TDP office: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు రాజ్యాంగ దినోత్సవాలు నిర్వహించారు. ఎన్టీఆర్ భవన్​లో నిర్వహించిన కార్యక్రమలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొనారు. నారా లోకేశ్ రాజ్యాంగ దినోత్సవంపై స్పందించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. రాజ్యాంగ హ‌క్కులకు దిక్కులేదని, నిల‌దీస్తే నిర్బంధమని లోకేశ్ వైసీపీపై మండిపడ్డారు.

Constitution Day celebrations at TDP office

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2023, 5:19 PM IST

Constitution Day celebrations at TDP office: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి.. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాడంటూ.. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్​లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం అచ్చెన్న మీడియాతో మాట్లాడారు. జగన్‌ తనపై ఉన్న 11 సీబీఐ కేసులు విచారణలో ఉంటే, 341 సార్లు ఆ కేసులు వాయిదా కోరాడని తెలిపారు. ఒక్కరోజు కూడా న్యాయస్థానానికి వెళ్ళాకుండా మోసం చేశారని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసుల వాయిదా వెళ్లకుండా ఉండే అవకాశం ఓక జాగన్ తప్ప సామాన్య పేదవాడికి ఎవరైనా దొరుకుతుందా అని నిలదీశారు. జగన్‌ తన అవినీతికి సంబంధించి కోర్టులో వేసిన నోటీసు పై వెంటనే విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాలని సవాల్‌ చేశారు. ఆర్టికల్ 14ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ కేసుల్లో న్యాయ సమీక్ష కావాలని డిమాండ్‌ చేశారు.

భారత రాజ్యాంగ దినోత్సవం - భీమ్ సేన ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్‌లో భారీ ర్యాలీ

రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లు చేస్తున్నారు: సీఎం జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ధిక్కరించి.. జగన్ తన తాత రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లు చేస్తోన్నారని ఆరోపించారు. జ‌గ‌న్ అనే నియంత స‌ర్కారుకి రాజ్యాంగ దినోత్సవం జ‌రుపుకునే హ‌క్కు లేదని లోకేశ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాజ్యాంగ హ‌క్కుల‌కి దిక్కులేదని, నిల‌దీస్తే నిర్బంధమని మండిపడ్డారు. స‌ర్కారు అవినీతి, అరాచ‌కాల‌ని ప్రశ్నిస్తే ప్రాణాలు తీసిన‌ జ‌గ‌న్ ఆట‌విక పాల‌నని అంత‌మొందించేందుకు ప్రజ‌లు ఉద్యమించాలని లోకేశ్ పిలుపునిచ్చారు. జ‌గ‌న్ నేర క్రూర పాల‌న‌కి బ‌లైన వారంద‌రికీ క‌న్నీటి నివాళులర్పించారు. ప్రజాస్వామ్య విలువ‌లు కాపాడ‌టానికి, అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ప‌ని చేస్తున్న మ‌హానుభావులు, ప్రజ‌ల‌కి లోకేశ్ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

ప్రజల ఆకాంక్షలు, అవసరాలను ప్రతిబింబించే సామాజిక, రాజకీయ పత్రమే రాజ్యాంగం : గవర్నర్

సమతా సైనిక్ దళ్: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో దళిత స్వాభిమాన యాత్రను చేపట్టారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమలో దళిత సంఘాల నేత మాల్యాద్రి, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేత ఫారూక్ షుబ్లీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు మాట్లాడారు. దళితుల పై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను వెలికి తీసేలా దళిత స్వాభిమాన యాత్ర చేపట్టామన్నారు. సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో గ్రామాల్లో యాత్ర సాగుతుందన్నారు. అంబేద్కర్ దళితులకు కల్పించిన హక్కులను ప్రజలకు‌ వివరిస్తామన్నారు. మోదీ, జగన్ లు అధికారంలోకి వచ్చాక దళితులు, మైనారిటీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

నాలుగున్నరేళ్లలో 4 లక్షల కోట్లు కొల్లగొట్టారు - ప్రజల ధనం దోపిడీ చేసే జగన్‌ ఈ స్థాయికి వచ్చారు: అచ్చెన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.