గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. రెండు నెలలుగా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాల్సింది పోయి... పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు అన్నారు. తక్షణమే పెంచిన ధరలను నియంత్రించాలని... లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేత సవరం రోహిత్ హెచ్చరించారు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన - congress protest news guntur
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. రెండు నెలలుగా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాల్సింది పోయి... పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు అన్నారు. తక్షణమే పెంచిన ధరలను నియంత్రించాలని... లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేత సవరం రోహిత్ హెచ్చరించారు.
ఇదీచదవండి: ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు