భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ఈనెల 17న మంత్రుల నివాసం ఎదుట నిరసన చేపడతాని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మూర్తి అన్నారు. లాక్డౌన్ నుంచి ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు 10 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ శాఖ నిధులలో నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 450 కోట్ల రూపాయలను తక్షణమే భవన నిర్మాణ శాఖకు తిరిగి ఇవ్వాలన్నారు. వాటి ద్వారా కార్మికుల ఆగిపోయిన బెనిఫెట్స్ తక్షణమే చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానం వలన భవన నిర్మాణ కార్మికుల రోడ్డున పడ్డారని రోడ్డున పడిన కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. నూతన ఇసుక విధానాన్ని రద్దు చేయాలన్నారు. తమ సమస్యలు పరిష్కారం కోసం ఈనెల 17 న రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల గృహాల ఎదుట ధర్నా చేపడతామని గుంటూరులో హోం మినిస్టర్ మేకతోటి సుచరిత గృహం ఎదుట నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి