తన కూతురిని హత్యచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని హత్యకు గురైన బీటెక్ యువతి కుటుంబం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కోరింది. ఘటన జరగగానే సీఎం జగన్ వెంటనే స్పందించారని రమ్య తల్లి జ్యోతి అన్నారు. తమ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందించారని వెల్లడించారు. మరో 4.5 లక్షల ఆర్థిక సాయాన్నికూడా అందించారని తెలిపారు. తమ కుటుంబానికి ముఖ్యమంత్రి పూర్తి అండగా నిలిచారని తెలిపారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని కలెక్టర్ అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కుటుంబానికి నివాస స్థలం, వ్యవసాయ భూమి, కుటుంబంలో పెద్దకుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: రమ్య కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం: సీఎం జగన్