CM JAGAN RELEASED WELFARE FUNDS : అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని సీఎం తెలిపారు. ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల్లో లబ్ధిపొందని వారికి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నిధులు జమ చేశారు. రెండోసారి దరఖాస్తు చేసిన అర్హులకు నగదు జమ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.79 లక్షల మందికి సుమారు రూ.590.91 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. అర్హత కలిగిన ఏ ఒక్క లబ్ధిదారుడు నష్టపోకూడదని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్ల పాత్ర కీలకం అని వ్యాఖ్యానించారు. కలెక్టర్ల కృషి వల్లే గొప్ప వ్యవస్థ తీసుకురాగలిగామని తెలిపారు. ముఖ్యమంత్రికి కలెక్టర్లు కళ్లు, చెవులు లాంటి వారని కితాబిచ్చారు. కలెక్టర్లు బాగా పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సూచించారు.
పింఛన్లు తీసేస్తున్నారని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని సీఎం జగన్ తెలిపారు. తప్పుడు ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. కలెక్టర్లు కూడా తగిన రీతిలో సమాధానం చెప్పాలని హితవు పలికారు. తమ ప్రభుత్వంలో 62 లక్షల 70 వేల మందికి పింఛన్లు పెంచామని.. ఎవరైనా పొరపాటున దరఖాస్తు చేసుకోకపోతే అడిగి మరి ఇస్తున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న ఏ ఒక్క పేదవాడు నష్టపోకూడదని.. ప్రతిఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలన్నారు.
ఇవీ చదవండి: