ETV Bharat / state

ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయం వద్దు.. వ్యవసాయశాఖపై సీఎం జగన్ సమీక్ష - వైసీపీ తాజా వార్తలు

CM YS Jagan Review Meet: వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి రెండో వారం వరకు ధాన్యం సేకరణ కొనసాగుతుందని సీఎం వెల్లడించారు. ఈ క్రాప్ డేటాలో నమోదు చేసిన రైతులందరి వద్ద ధాన్యం సేకరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయం ఉండకూడదని సూచించారు.

CM YS Jagan Review Meet
CM YS Jagan Review Meet
author img

By

Published : Jan 18, 2023, 8:24 PM IST

CM YS Jagan Review on agriculture : వ్యవసాయశాఖపై సీఎం జగన్ సమీక్షించారు. ధాన్యం సేకరణపై రైతుల ఆందోళనలపై అధికార్లతో మాట్లాడారు. ఫిబ్రవరి రెండో వారం వరకు ధాన్యం సేకరణ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ క్రాప్ డేటాలో నమోదు చేసిన మేరకు రైతులందరి వద్ద ధాన్యాన్ని సేకరించాలని జగన్ ఆదేశించారు. ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయం ఉండకూడదని , అదే సమయంలో రైతులకు నష్టం జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రబీ పై కూడా ఆయన అధికార్లకు పలు సూచనలు చేశారు.

రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి, సేకరణ పై సీఎం కు అధికారులు నివేదిక అందించారు. 2014–19 మధ్య ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి 153.95 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా... 2019–20 నుంచి 2022–23 ఖరీప్‌ వరకూ సగటు ఆహారధాన్యాల ఉత్పత్తి 166.09 లక్షల మెట్రిక్‌ టన్నులుగా చేరిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 5,373 కోట్లు విలువైన ధాన్యాన్ని సేకరించామన్న అధికారులు, ఇప్పటికే రైతులకు 89 శాతం చెల్లింపులు చేసినట్లు తెలిపారు. ధాన్యం సేకరణ కొనసాగుతుందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పంటల సీజన్లను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి రెండోవారం వరకూ సేకరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

రైతుల ఫిర్యాదుపై: స్థానిక వీఏఓ, డీఆర్‌ఓ, సర్టిఫై చేసిన తర్వాతే ధాన్యం సేకరణ ముగిస్తామని అధికారులు తెలిపారు. సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక నంబర్‌ను ఏర్పాటు చేయాలని, రైతులు ఫిర్యాదు చేయగానే వెంటనే స్పందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఏడాదికి ధాన్యం కొనుగోలు సేకరణకు సుమారు 8వేల కోట్లు ఖర్చు అయితే వైకాపా ప్రభుత్వం హయాంలో ఏకంగా 15వేల కోట్లు సగటున ఏడాదికి ధాన్యం సేకరణకు పెడుతున్నట్లు తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా రైతులకు అనుకున్న సమయానికే చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. గతంలో లేని రీతిలో రంగుమారిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రబీకి సంబంధించి ఇ– క్రాప్‌ బుకింగ్‌ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభిస్తామని, మార్చి మొదటి వారంలో తుది జాబితా వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు.

2వేల డ్రోన్లను పంపిణీ: రబీలోనూ రైతులకు విత్తనాలు, ఎరువుల పరంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని , దీన్ని అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆర్బీకేల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు, కిసాన్‌ డ్రోన్లు, రైతులకు 50శాతం సబ్సిడీతో వ్యక్తిగత వ్యవసాయ పరికరాల పంపిణీపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మార్చి, మే–జూన్‌ నెలల్లో కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. 2వేల డ్రోన్లను పంపిణీ చేసే దిశగా కార్యాచరణ చేశామని, తొలివిడతగా రైతులకు 500 డ్రోన్లు ఇస్తామని తెలిపారు. డ్రోన్ల వినియోగంపై రైతులకు ఇస్తోన్న శిక్షణ కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలన్న సీఎం... ఉత్తరాంధ్రలోనూ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఆర్బీకేలో భూసార పరీక్ష: ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై కార్యాచరణ రూపొందించాలని, భూ సార పరీక్షలను ఏటా ఏప్రిల్‌ మాసంలో జరపాలన్నారు. పంటకు అవసరమైన పోషకాలను సూచించాలన్నారు. భవిష్యత్తులో ప్రతి ఆర్బీకేలోనూ భూసార పరీక్ష చేసే పరికరాలు ఉంచాలని జగన్ సూచించారు. దీనికి సంబంధించి శిక్షణ కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ప్రతి గ్రామంలో భూసార పరీక్ష తర్వాత మ్యాపింగ్‌ జరగాలన్నారు. మాండస్‌ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధంకావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023ను ప్రకటించిన నేపథ్యంలో చిరుధాన్యాల వినియోగంపై కార్యాచరణ రూపొందించామని అధికారులు సీఎం కు తెలిపారు. పేదలకు చిరు ధాన్యాలు అందించడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నామన్న పౌరసరఫరాలశాఖ అధికారులు సీఎంకు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.