ఆస్తి పన్నుచెల్లింపులో 5 శాతం రాయితీ పొందడానికి 2 రోజులే గడువు ఉందని.. పన్ను బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ చల్లా అనురాధ కోరారు. పలు సంస్థలు ముందుగా పన్ను చెల్లించి 5శాతం రాయితీ పొందినట్లు పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారుల కోసం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయం, పలకలూరు రోడ్లోని 106వ సచివాలయం, అమరావతి రోడ్ లోని 140 వ సచివాలయంలో, ఆర్టీసీ కాలనీలోని ఆరో సచివాలయం, నల్ల చెరువులోని 66వ సచివాలయం, బుడంపాడులోని 195వ సచివాలయాల్లో క్యాష్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
నగరపాలక సంస్థ క్యాష్ కౌంటర్ లోనే కాకుండా ఆన్ లైన్ www.cdma.ap.gov.in ద్వారా కూడా ఈ నెల 30లోపు పన్ను చెల్లించి రాయితీ పొందవచ్చన్నారు. 5 శాతం రాయితీ కేవలం ఈ ఆర్ధిక సంవత్సరం ఏక మొత్తంలో పన్నును చెల్లించినవారికి మాత్రమే వర్తిసుందని, పాత బకాయిలు ఉన్నవారికి, ఆస్తి పన్నులో అనాధికార అపరాధ రుసుంను విధించినవారికి వర్తించదన్నారు. పన్ను చెల్లింపు నిమ్మిత్తం క్యాష్ కౌంటర్ లకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, తగిన భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇవీ చూడండి...