అమరావతికి మద్దతుగా దీక్ష చేస్తున్న రైతులకు చిన్నారులు సంఘీభావం తెలిపారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో కూర్చొని చదువుకున్నారు. ఇంట్లో పెద్దలు ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఒంటరిగా ఉండాలంటే భయమేస్తోందని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అమరావతికి మద్దతునిస్తూ చదువుకుంటున్నామని చెబుతున్నారు. 'సీఎం అంకుల్... మా బాధ చూసైనా మనసు మార్చుకోండి' అని దీనంగా వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: 75వ రోజుకు రైతుల ఆందోళనలు.. రాయపూడిలో జలదీక్ష