ETV Bharat / state

ముఖ్యమంత్రి నివాసానికి కరోనా ఎఫెక్ట్ - ముఖ్యమంత్రి నివాసానికి కరోనా ఎఫెక్ట్

తాడేపల్లి కరోనా పాజిటివ్​ కేసు సీఎం నివాసం వరకూ చేరింది. ముఖ్యమంత్రి నివాసం సైతం బఫర్​జోన్​లోకి వెళ్లినట్లు అధికారులు గూగుల్​ మ్యాప్​ ద్వారా గుర్తించారు.

Chief Minister Jagan's residence in Buffer Zone at thadepalli in guntur

author img

By

Published : Apr 16, 2020, 6:27 AM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతో ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రాంతం బఫర్​జోన్​లోకి వెళ్లింది. నిబంధనల ప్రకారం కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతం నుంచి కిలోమీటరు వరకు రెడ్​జోన్​ అని, మూడు కిలోమీటర్ల పరిధిని క్లస్టర్ కంటైన్​మెంట్ జోన్​గా, ఏడు కిలోమీటర్ల పరిధిని బఫర్​జోన్​గా అధికారులు ప్రకటించారు. పాజిటివ్ కేసు నమోదైన తాడేపల్లి పట్టణంలోని డోలాస్​నగర్ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి నివాసం ఏడు కిలోమీటర్ల పరిధిలోపల ఉన్నట్లు గూగుల్​ మ్యాప్​ ద్వారా అధికారులు గుర్తించారు. పాజిటివ్ కేసు నమోదైన డోలాస్​ ప్రాతం నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో 3,982 గృహలతో పాటు 11,180 జనాభా రెడ్​జోన్​లోకి వస్తున్నట్లు వెల్లడించారు.

గుంటూరు జిల్లావ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 122కి చేరుకుంది. రాష్ట్రంలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాగా గుంటూరు కొనసాగుతోంది.

ఇదీ చదవండి: క్వారంటైన్ పూర్తి చేసుకున్న పేదలకు ఆర్థిక సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.